నష్టపోకుండా అత్యధిక పరిహారం | - | Sakshi
Sakshi News home page

నష్టపోకుండా అత్యధిక పరిహారం

Feb 18 2026 7:00 AM | Updated on Feb 18 2026 7:00 AM

నష్టపోకుండా అత్యధిక పరిహారం

నష్టపోకుండా అత్యధిక పరిహారం

ఖమ్మం సహకారనగర్‌: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా భూమి ఇచ్చే రైతులు, యజమానుల ఖాతాల్లో నిబంధనల మేర అత్యధిక పరిహారం జమ చేసినట్లు కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. సింగరేణి మండలం బాజు మల్లాయిగూడెం, రేలకాయలపల్లి గ్రామాల రైతులతో మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో చర్చించారు. బాజుమల్లాయిగూడెం, రేలకాయపల్లిల్లో సీతారామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీ పనులకు భూ సర్వే నిర్వహించి అవార్డులు ప్రకటించామని తెలిపారు. ఆపై అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించడంతో పాటు నిబంధనల ప్రకారం భూముల్లోని పంపుసెట్లు, సుబాబుల్‌, ఇతర చెట్లతో పాటు నిర్మాణాలకు ప్రత్యేక పరిహారం అందించామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట పరిహారం చెల్లించినందున భూనిర్వాసితులు పనులకు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్‌డీసీ ఎం.రాజేశ్వరి, ఆర్‌డీఓ జి.నర్సింహారావు, ఇరిగేషన్‌ ఈఈ కె.బాబూరావు, డీఈ ఎస్‌.కిషోర్‌, తహసీల్దార్‌ ఆనంతుల రమేష్‌ పాల్గొన్నారు.

పకడ్బందీగా మ్యాపింగ్‌

ప్రత్యేక సమగ్ర సవరణ దృష్ట్యా ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం ఆయన వీసీ ద్వారా ప్రత్యేక సమగ్ర సవరణకు ముందుగా చేపట్టే మ్యాపింగ్‌ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శర్‌రెడ్డి మాట్లాడుతూ బూత్‌ స్థాయి అధికారులకు సహకరిస్తూ ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులకు ఈ విషయమై అవగాహన కల్పించాలని, ఇతర దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలో ప్రక్రియ వివరాలను కలెక్టర్‌ అనుదీప్‌ వివరించగా, అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, కల్లూరు సబ్‌కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, ఆర్‌డీఓ నర్సింహారావు, ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అనంతుల రమేష్‌, అరుణ, అన్సారీ పాల్గొన్నారు.

భూనిర్వాసితుల సమావేశంలో

కలెక్టర్‌ అనుదీప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement