పల్లెల్లో నిధుల పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో నిధుల పంచాయితీ

Feb 18 2026 7:00 AM | Updated on Feb 18 2026 7:00 AM

పల్లెల్లో నిధుల పంచాయితీ

పల్లెల్లో నిధుల పంచాయితీ

● పెండింగ్‌ బిల్లుల విషయంలో కొర్రీలు ● పాత – కొత్త సర్పంచ్‌ల మధ్య నలుగుతున్న కార్యదర్శులు

ఎన్నికల్లో సహకరించలేదని...

● పెండింగ్‌ బిల్లుల విషయంలో కొర్రీలు ● పాత – కొత్త సర్పంచ్‌ల మధ్య నలుగుతున్న కార్యదర్శులు

నేలకొండపల్లి: గ్రామపంచాయతీల్లో కొన్నాళ్లు కొత్త పాలకవర్గాలు కొలువుదీరగా... రెండు నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. అయితే, ఈనిధులతో జీపీల్లో కొత్త పంచాయితీ నెలకొంది. దాదాపు రెండేళ్ల పంచాయతీలకు సర్పంచ్‌లు లేకపోవడంతో కేంద్రం నుంచి నిధులు నిలిచిపోయాయి. అత్యవసర పనులకు కార్యదర్శులే సొంతంగా ఖర్చు చేశారు. అంతేకాక గత పాలకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసిన అప్పటి సర్పంచ్‌లకు బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. ఇంతలోనే కేంద్రం నుంచి నిధులు మంజూ రు కాగా తమ బకాయిలను పంచాయతీ కార్యదర్శులు తీసుకుంటున్నారు. కానీ పాత సర్పంచ్‌లకు సంబంధించి బిల్లులు ఇచ్చే విషయంలో కొత్త సర్పంచ్‌లు కొన్నిచోట్ల కొర్రీలు పెడుతున్నట్లు సమాచారం. ఈక్రమాన మధ్యలో కార్యదర్శులు నలిగిపోతున్నట్లు తెలుస్తోంది.

పాత సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించే విషయంలో కొత్తసర్పంచ్‌లు నిరాకరిస్తుండడం వెనుక పలు కార ణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎన్నికల వేళ తమకు సహకరించలేదనే భావనతో పాత వారి బిల్లులు పక్కన పెడుతున్నట్లు సమాచారం. దీంతో నే గత పాలకవర్గం తీర్మానాలు, అధికారుల ఎం.బీ. రికార్డులు చేసినా, మరికొన్నింటికి చెక్కులు జారీ అయినప్పటికీ నిధులు లేక తిరస్కరించిన బిల్లులు సైతం ఇవ్వడం లేదని తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం ఇటీవల విడుదలచేసిన నిధులను 2023–24లో వీధిదీపాల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు, పారిశుద్ధ్య నిర్వహణ, పైపులైన్‌ లీకేజీల మరమ్మతుల పనులకు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ పనులకు మాజీ సర్పంచ్‌లు అప్పులు చేసి మరీ వెచ్చించగా ప్రస్తుత సర్పంచ్‌లు అడ్డు తగులుతుండడంతో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు మాజీ సర్పంచ్‌లు ఎంపీడీఓలకు ఫిర్యాదుచేశారు. అంతేకాక కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ఇంకొందరు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పంచాయతీ నిధులగొడవ పెద్దదిగా మారకముందే అధికారులు కొత్తసర్పంచ్‌లకు తగిన ఆదేశాలు జారీ చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై నేలకొండపల్లి ఎంపీడీఓ ఎం.యర్రయ్య వివరణ కోర గా... 2023–24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు గాను బిల్లులు మంజూరయ్యాయని తెలి పారు. కొత్త సర్పంచ్‌లకు ఈ విషయమై సృష్టత ఇస్తామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement