● ఆయువుపట్టు.. సూపర్‌బజార్!
సూపర్‌బజార్(కొత్తగూడెం): సింగరేణి కార్మికుల నిత్యావసరాల కొనుగోళ్లకే కాకుండా ఇతర వర్గాల ప్రజానీకానికి సైతం అన్ని వస్తువులు దొరికే ప్రాంతంగా కొత్తగూడెంలోని సూపర్‌బజార్ సెంటర్ నిలుస్తోంది. కొత్తగూడెం రైల్వేస్టేషన్ సమీపాన జాతీయ రహదారి పక్కన సూపర్‌బజార్‌ను సింగరేణి సంస్థ ఏళ్ల క్రితం ఏర్పాటు చేసింది. అంతకముందు నాలుగు రోడ్లు కలిసే జంక్షన్ కావడంతో త్రీటౌన్ సెంటర్ లేదా రైల్వేస్టేషన్ సెంటర్‌గా పిలిచేవారు. సూపర్‌బజార్ ఏర్పాటయ్యాక అదే పేరు స్థిరపడింది. సూపర్‌బజార్ ఎదురుగా జాతీయ రహదారి ఇరువైపులను కలుపుతూ ఆర్చి కూడా ఉంటుంది. ఈ సెంటర్‌లో ప్రతీ ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు నిలుపుతుండడంతో నిత్యం రద్దీగా ఉంటుంది.


