నూతన పాలకవర్గాలకు మంత్రి పొంగులేటి శుభాకాంక్షలు
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీల్లో నూతనంగా ఎన్నికై న మేయర్, చైర్మన్‌తో పాటు, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సారథులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పట్టణాల అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదర్శవంతమైన పాలన అందించాలని, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వాన పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి తెలిపారు.
3,017.16 మెట్రిక్ టన్నుల యూరియా
చింతకాని: జిల్లాలోని చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఈ యూరియాలో ఖమ్మం జిల్లాకు 1,917.16 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 300 మె.టన్నులు కేటాయించినట్లు ఏఓ(టెక్నికల్) పవన్‌కుమార్ తెలిపారు. అలాగే, మహబూబాబాద్ జిల్లాకు 600 మెట్రిక్ టన్నులు సరఫరా చేయగా, మిగతా 200 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేసినట్లు వెల్లడించారు.
సీహెచ్‌సీలో కాయకల్ప బృందం పరిశీలన
నేలకొండపల్లి: నేలకొండపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సోమవారం కాయకల్ప బృందం పరిశీలించింది. ఇంటర్నల్ అసిస్టెంట్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు ఆధ్వర్యాన వచ్చిన బృందం ఆస్పత్రి పరిసరాలు, ఇక్కడ అందుతున్న చికిత్స, ఇస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించిపలువురితో మాట్లాడారు. ఆతర్వాత వైద్యులతో సమావేశమై రోజువారీ ఓపీ, మందుల లభ్యతపై చర్చించారు. వైద్యాధికారులు మంగళ, కె.రాజేష్, ఉద్యోగులు పాల్గొన్నారు.


