శివాలయాల్లో పొంగులేటి పూజలు
ఖమ్మంరూరల్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలోని సంగమేశ్వరస్వామి, కూసుమంచి గణపేశ్వరాలయం, భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు కనకగిరి గుట్టలపై వేంచేసి ఉన్న వీరభద్రస్వామి ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని, రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని పరమశివుడిని వేడుకున్నట్లు తెలిపారు.


