సాగర్‌ కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

Feb 12 2026 7:39 AM | Updated on Feb 12 2026 7:39 AM

సాగర్

సాగర్‌ కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

ఖమ్మంక్రైం: ఖమ్మం టేకులపల్లి బ్రిడ్జి సమీపాన సాగర్‌ కాల్వలో గుర్తు తెలియని వ్యక్తి(55) మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. కాల్వలో మృతదేహం కొట్టుకువెళ్తుండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు టౌటౌన్‌ పోలీసులు చేరుకున్నారు. ఆపై అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో బయటకు తీశారు. అయితే, మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించే పరిస్థితి లేకపోవడంతో శ్రీనివాసరావు మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై మార్చురీకి తీసుకెళ్లారు. మృతుడి వివరాలు తెలిస్తే టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ (87126 59110)లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.

కల్లాల్లో 30 క్వింటాళ్ల మిర్చి చోరీ

మధిర: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు కల్లాల్లో ఆరబోసిన మిర్చిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రాయపట్నం గ్రామంలో ఆగొల్ల వెంకట్రావుకు చెందిన 15 క్వింటాళ్లు, నాగనబోయిన వెంకటేశ్వర్లుకు చెందిన పది క్వింటాళ్లతో పాటు దేశినేనిపాలెంలో శాఖమూడి శ్రీనుకు చెందిన ఐదు క్వింటాళ్ల మిర్చి చోరీకి గురైంది. మంగళవారం రాత్రి కల్లాల్లో ఆరబోసిన రైతులు బుధవారం ఉదయం వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు.

వయోజన విద్య

రిటైర్డ్‌ డీడీ మృతి

మధిర: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన రావిరాల బసవయ్య(90) బుధవారం రాత్రి మృతి చెందారు. మధిరలోని లడక బజార్‌కు చెందిన ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘంలో కీలకంగా వ్యవహరించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బసవయ్యకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపై రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం బాధ్యులతో పాటు వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించడమే కాక నివాళులర్పించారు.

సాగర్‌ కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
1
1/1

సాగర్‌ కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement