రోప్ వే ఏర్పాటెప్పుడో..?
● కిన్నెరసానిలో పరిశీలించిన పుణే బృందం ● నెల రోజులు గడిచినా కదలికలేని ప్రక్రియ
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో పర్యాటకుల ఆహ్లా దం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ ఆచరణలో అమలు చేయడంలేదు. సఫారీ ఏర్పాటకు అటవీశాఖ ప్రత్యేకంగా రూ.45లక్షలతో వాహనాలు కొనుగోలు చేసింది. ఇంతవరకు సఫారీ ఏర్పాటు జాడలేదు. రోప్ వే కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించా రు. నెలరోజుల క్రితం పుణే నుంచి ప్రత్యేక బృందం వచ్చి పరిశీలించి వెళ్లింది. ఆతర్వాత రోప్ వే ఊసే లేదు. పర్యాటకులు, సహసయాత్రికుల కోసం రోప్ వే (జిప్‌లైన్)ను ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేశారు. కిన్నెరసానిలోని అద్దాల మేడ నుంచి జలా శయం మధ్యలో ఉన్న చిన్న ద్వీపం వరకు సుమారు అర కిలోమీటర్ మేర సింగిల్ రోప్ వే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.25 లక్షల వ్యయం అవుతుందని అంచనా రూ పొందించారు. నిధుల కొరత కారణంగా తొలు సింగిల్ రోప్ వే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రోప్ వే ఏర్పాటుకు పుణే నుంచి నెయిల్ అడ్వెంచర్స్ పంకజ్ కుమేరియా బృందం గత నెల 23న కిన్నెరసానిలో పర్యటించింది. నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని బృందం సభ్యులు తెలిపారు. కానీ ఆ తర్వా రోప్ వే ఏర్పాటులో కదలిక లేకుండాపోయింది.
డార్జిలింగ్ తరహాలో..
రోప్‌వేలు కేరళ, మయన్మార్, డార్జిలింగ్ ప్రాంతాల్లో ఎత్తైన కొండ ప్రదేశాల మధ్య ఉన్నాయి. దీంతో ఆయా ప్రదేశాలకు వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. కిన్నెరసానిలో కూడా రోప్‌వే ఏర్పా టు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది.
రోప్ వే ఏర్పాటెప్పుడో..?


