మధిర యువకుడి బ్రెయిన్‌డెడ్
మఽధిర: బీటెక్ చదువుతున్న ఓ యువకుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రె యిన్ డెడ్ కాగా, కుటుంబీ కులు పుట్టెడు దుఃఖంలో నూ అయవదానానికి అంగీకరించి ఐదుగురి జీవితా ల్లో వెలుగులు నింపారు. మధిరకు చెందిన కందిమళ్ల విజయ్‌కుమార్(20) విజయవాడలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 6వ తేదీన తాడేపల్లిలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను అక్కడి ఆస్పత్రికి తరలించారు. అయితే, మెదడులో రక్తస్రావం జరుగుతోందని గుర్తించి చికిత్స చేసినా ఫలితం లేక వైద్యులు బుధవారం బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. ఆపై విజయ్ తండ్రి సైదేశ్వరరావు, కుటుంబీకులకు ఆంధ్రప్రదేశ్ జీవన్‌ధాన్ చైర్మన్ డాక్టర్ కె.రాంబాబు, మణిపాల్ ఆస్పత్రి డైరెక్టర్ రామాంజనేయరెడ్డి అవగాహన కల్పించగా అవయవదానానికి అంగీకరించారు. దీంతో గుండె, కాలేయంను మణిపాల్ ఆస్పత్రిలో అవసరమైన ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయగా, ఊపిరితిత్తులను హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి, కిడ్నీలను గుంటూరు విధాత ఆస్పత్రికి, కార్నియా ను విజయవాడ ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి అందజేసి అవసరమైన వారికి అమర్చారు.
అవయవదానంతో
ఐదుగురికి జీవితాల్లో వెలుగులు


