‘ఎన్నికల వేళ అధికార దుర్వినియోగం’
ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతుందని ఆరోపించే కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఖమ్మం జిల్లాలో పరిణామాలను గుర్తించాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు సూచించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎవరు ఓట్ల చోరీకి పాల్పడ్డారో తెలిసిపోయిందని పేర్కొన్నారు. పోలింగ్ సరళి, ఎన్నికల నిర్వహణలో చోటుచేసుకున్న అనుమానాస్పద పరిణామాలపై వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
ఆర్‌టీఐ కమిషనర్ తనిఖీ
ఖమ్మం సహకారనగర్: జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్‌టీఐ కమిషనర్ శ్రీనివాసరావు బుధవారం తనిఖీ చేశారు. ఖమ్మం ఆర్డీఓ కార్యాలయం, ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయాల్లో తనిఖీ చేసిన ఆయన ఆర్‌టీఐ దరఖాస్తులు, పరిష్కారంపై సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని నిబంధనల మేరకు ఇవ్వాలని తెలిపారు.
నేడు కార్మికుల సమ్మె
లేబర్ కోడ్ల రద్దు డిమాండ్‌తో పిలుపు
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని ఆరోపిస్తూ.. వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం సమ్మె జరగనుంది. పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేయడం సరికాదని నిరసించడంతో పాటు వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రతకు సంబంధించిన కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ఈ సమ్మె చేపడుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26వేలు అమలుచేయడంతో పాటు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని తదితర డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈమేరకు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీయూసీఐ, సీఐటీయూ, బీఆర్‌టీయూ, ఐఎఫ్‌టీయూ సంఘాల ప్రతినిధులు కొద్దిరోజులుగా సమ్మెను విజయవంతం చేయాలని పారిశ్రామిక ప్రాంతాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, పని ప్రదేశాల్లో ప్రచారం చేయడమే కాక యాజమాన్యాలకు నోటీసులు అందజేశారు.
కుల, జనన
ధ్రువపత్రాలు రద్దు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం అర్బన్ తహసీల్దార్ 2019లో ఓ వ్యక్తికి జారీ చేసిన బీసీ–ఈ కుల ధ్రువీకరణ పత్రంతో జనన ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం బొక్కలగడ్డకు చెందిన షేక్ హమీద్ విషయంలో ఈ నిర్ణయం తీసుకోగా, విచారణకు రావాలని నోటీసు జారీ చేసినట్లు తహసీల్దార్ సైదులు తెలిపారు.
‘ఉపాధి’ పనులు
పరిశీలించిన డీఆర్‌డీఓ
ముదిగొండ: మండలంలోని గోకినేపల్లి, వెంకటాపురం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులను డీఆర్‌డీఓ శ్రీరామ్ బుధవారం పరిశీలించారు. పంట కాల్వల పూడికతీత పనులు, నర్సరీల్లో మొక్కలను పెంపకాన్ని పరిశీలించిన ఆయన హాజరైన కూలీలతో మాట్లాడారు. పనుల గుర్తింపు, కూలీలకు కేటాయింపులో ఇబ్బందులు రాకుండా చూడాలని ఉద్యోగులను ఆదేశించారు. ఎంపీడీఓ కొండపల్లి శ్రీదేవి, ఏపీఓ రంగనాయకమ్మ, గోకినేపల్లి సర్పంచ్ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
‘ఎన్నికల వేళ అధికార దుర్వినియోగం’
‘ఎన్నికల వేళ అధికార దుర్వినియోగం’


