జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ

Feb 17 2026 7:28 AM | Updated on Feb 17 2026 7:28 AM

జేఈఈ

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి గతనెలలో నిర్వహించిన జేఈఈ (మెయిన్‌) పేపర్‌–1 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఉదయం ఫైనల్‌ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ అధికారులు.. సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రైవేట్‌ కళాశాలల విద్యార్థులు ఉత్తమ పర్సంటైల్‌తో సత్తా చాటారు. ఈ మేరకు విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు అభినందించాయి.

– ఖమ్మం సహకారనగర్‌:

ఎస్‌ఆర్‌ విజయఢంకా

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్‌ సాధించి విజయఢంకా మోగించారని విద్యాసంస్థల చైర్మన్‌ వరదారెడ్డి తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆయన అభినందించగా అధ్యాపకులు వివరాలను వెల్లడించారు. సందీప్‌ 99.55 పర్సంటైల్‌, గ్రీష్మంత్‌ తేజ్‌ 99.34, అనూష 98.50, కమరాన్‌ ముస్తఫా 96.13 పర్సంటైల్‌ సాధించారన్నారు. డైరెక్టర్లు మధుకర్‌ రెడ్డి, సంతోష్‌రెడ్డి, సీఈఓ సురేందర్‌రెడ్డి, డీజీఎం గోవర్దన్‌ రెడ్డి, చీఫ్‌ జోనల్‌ సదన్‌రావు, జోనల్‌ ఇన్‌చార్జ్‌ విజయభాస్కర్‌రెడ్డి, డీన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ప్రిన్సిపాళ్లు అశోక్‌, శ్రీనివాస్‌, సుధాకర్‌, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

న్యూవిజన్‌ విజయకేతనం

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని న్యూవిజన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ సీహెచ్‌జీకే.ప్రసాద్‌ తెలిపారు. అత్యుత్తమ పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులను అభినందించాక ఆయన మాట్లాడారు. కళాశాల నుంచి 99 పర్సంటైల్‌ 13 మందికి, 98 పర్సంటైల్‌ 26 మంది విద్యార్ధులు సాధించారన్నారు. ఇందులో ఏపూరి నిహంత్‌ 99.89 పర్సంటైల్‌, రాయపూడి సాత్విక్‌ కుమార్‌ 99.85, పోట్ల జీవన్‌ 99.82, వేమూరి రిషికార్తిక్‌ 99.80, తూము నాగేందర్‌ 99.74, మారేమళ్ల లోకేష్‌ 99.70, తాళ్లూరి రేవంత్‌కుమార్‌ 99.56, మహ్మద్‌ రెహాన్‌ షేక్‌ 99.49, దీవెల మోహన్‌ 99.47, మహ్మద్‌ రిజా సిమ్రా 99.39, బయ్యారపు రేవంత్‌ ప్రసాద్‌ 99.25, సత్యాల సిరిసంజన 99.12, కొమ్మినేని మౌక్తిక 99.02, కనకమేడల రిత్విక్‌చౌదరి 98.87, షేక్‌ షాహిద్‌ 98.87, బానోత్‌ శ్రీకరణ్‌ 98.57, కొత్తకొండ నాగ చైత్రిక్‌ 98.50, కొళ్లూరి రూపిక 98.42, షేక్‌ సైఫ్‌ ఉల్‌ అజ్మణ్‌ 98.41, మూడ్‌ చరణ్‌ చౌహాన్‌ 98.37, అనుమోలు శ్రావణ్‌ 98.16, మాధవరపు నాగ వెంకట సాయిచరణ్‌ 98.13, కోట సాయిసాత్విక్‌ 98.10, ఉప్పునూరి మన్వితారెడ్డి 98.26, బొల్ల నాగసాయి జస్వంత్‌ 98.31పర్సంటైల్‌ సాధించారని వెల్లడించారు. అకడమిక్‌ డైరెక్టర్‌ సీహెచ్‌.కార్తీక్‌, డైరక్టర్‌ సీ.హెచ్‌.గోపిచంద్‌, డీన్‌ శ్రీధర్‌, ప్రిన్సిపాళ్లు బ్రహ్మచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ1
1/1

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement