సాయి మందిరంలో ‘అక్షయపాత్ర’ విగ్రహం
ఖమ్మంగాంధీచౌక్: ఖమం గాంధీచౌక్‌లోని షిర్డీ సాయి మందిరం వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అక్షయపాత్ర విగ్రహాన్ని షిర్డీ సంస్థాన్ సీఈఓ గోరక్ష ఘడిల్టర్ బాబా ఆవిష్కరించారు. మందిరం చైర్మన్ డాక్టర్ వి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల చైర్మన్లను సన్మానించడమే బ్రాహ్మణులకు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండా వీరేంద్రదాస్, రేణుక, మల్లయ్య, అర్వపల్లి నిరంజన్, పీవీడీ.ప్రసాద్, కురువెల్ల జగన్మోహన్‌రావు, డాక్టర్ వేములపల్లి నరేష్, శ్రీనివాసరావు, నగేష్, గన్నవరపు నాగేశ్వరరావు, ఎం.శ్రీధర్, కె.శ్రీనివాస్, శీలం హన్మంతరావు, బోనగిరి ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.


