ఊడిపోయిన బీబీసీ షట్టర్
కొణిజర్ల: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ నుంచి బోనకల్ బ్రాంచ్ కాల్వకు నీరు విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన రెండు షట్టర్లలోలో ఒకటి ఊడిపోయి కొద్దిపాటి పట్టుతో నిలిచింది. దీంతో నీటికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాక వృథాగా పోతోంది. ప్రస్తుతం బోనకల్ బ్రాంచ్ కాల్వ పరిధిలో మొక్కజొన్న పంట సాగు చేస్తుండగా నీటి అవసరం కూడా అంతగా లేకున్నా మరమ్మతు చేయకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు చెబుతున్నారు. సాగర్ ప్రధాన కాల్వకు బీబీసీకి అనుసంధానంగా ఏర్పాటు చేసిన షట్టర్లు కూడా తుప్పుపట్టి శిధిలావస్థకు చేరడంతో నీటి ఉధృతి కారణంగా షట్టర్ ఊడి పోయిందని తెలుస్తోంది. ఈ విషయమై జలవనరులు శాఖ ఏఈ పూర్ణచంద్రరావును వివరణ కోరగా నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నందుకు షట్టర్ మరమ్మతులు సాధ్యం కావడం లేదన్నారు. వారబందీ ప్రకారం నీటి ప్రవాహం నిలిపివేశాక తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. అయితే, ఇప్పటికే కొత్తషట్టర్లు కూడా మంజూరైనందున నీటి సరఫరా గడువు ముగిశాక వేసవిలో పనులు చేపడుతామని వెల్లడించారు.
వృథాగా పోతున్న సాగునీరు


