విస్తృతంగా తనిఖీలు
కల్లూరురూరల్: కల్లూరు పరిధిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యాన పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. మున్సిపాలిటీ సరిహద్దు గ్రామమైన హనుమాన్ తండా వద్ద హైవేపై చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఇక్కడ విడతల వారీగా విధులు నిర్వర్తిస్తున్న వివిధ శాఖల ఉద్యోగులు 24 గంటల పాటు తనిఖీలు చేస్తున్నారు.
11న జిల్లాస్థాయి
ఖేలో ఇండియా పోటీలు
ఖమ్మంస్పోర్ట్స్: ఈనెల 11వ తేదీన జిల్లాస్థాయి ఖేలో ఇండియా క్రీడాపోటీలు నిర్వహిస్తామని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. అండర్– 14, 17 విభాగాల నుంచి అథ్లెటిక్స్, కబడ్డీ, బాక్సింగ్ అంశాల్లో బాలికలకు సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఇక్కడ ప్రతిభ కనబర్చిన వారిని అస్మిత లీగ్‌కు ఎంపిక చేయడంతో పాటు జాతీయస్థాయి పోర్టల్‌లో పేర్లు నమోదు చేస్తామని తెలిపారు. తద్వారా స్పోర్ట్స్ అథారిటీ కేంద్రాల్లో శిక్షణ అందుతుందని పేర్కొన్నారు.
స్కార్పియోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
కూసుమంచి: మండలంలోని జీళ్లచెరువు సమీపంలో ఆర్టీసీ బస్సు స్కార్పియో వాహనాన్ని ఢీకొట్టిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పాలేరు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు వాహనంలో ఖమ్మం వెళ్తుండగా జీళ్లచెరువు సమీపంలో సూర్యాపేట వైపు వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న నలుగురికి ఎలాంటి గాయాలు కాలేదు.


