అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ‘లూనా’
ఖమ్మంఅర్బన్: ఖమ్మంకు చెందిన యువ దర్శకుడు గోగినేని ఆకాష్ రూపొందించిన విజ్ఞాన కల్పిత లఘుచిత్రం ‘లూనా’కు ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రశంసలు దక్కాయి. న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగిన చలన చిత్రోత్సవంలో ‘లూనా’ను ప్రదర్శించారు. గతంలోనే ఈ చిత్రం జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికై న విషయం విదితమే. తాజాగా ఢిల్లీలో జరిగిన చలన చిత్రోత్సవంలో ఆకాశ్‌కు పురస్కారం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉండడంతో ఆకాశ్ తల్లిదండ్రులు గోగినేని కిరణ్‌కుమార్, హిమబిందు పురస్కారం స్వీకరించారు.
నగర వాసి రూపొందించిన లఘుచిత్రానికి పురస్కారం


