అభివృద్ధి.. ఇంకొన్ని ప్రణాళికలు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి.. ఇంకొన్ని ప్రణాళికలు

Feb 11 2026 7:26 AM | Updated on Feb 11 2026 7:26 AM

అభివృద్ధి.. ఇంకొన్ని ప్రణాళికలు

అభివృద్ధి.. ఇంకొన్ని ప్రణాళికలు

● మధిరలో రూ.600కోట్ల నిధులతో పనులు ● పురోగతిలో పలు నిర్మాణాలు

● మధిరలో రూ.600కోట్ల నిధులతో పనులు ● పురోగతిలో పలు నిర్మాణాలు

మధిర: మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగానే కాక ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్‌ మంత్రిత్వ శాఖలు చూస్తున్నారు. దీంతో మధిర మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం రూ.600 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో రోడ్లను బీటీ రోడ్లుగా తీర్చిదిద్దగా.. మధిర మున్సిపల్‌పై మరింత ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రస్తుతం జరుగుతున్న పనులు

మధిర మున్సిపాలిటీ కేంద్రంలో మురుగునీరు బయటకు కనిపించకుండా రూ.128 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే, మేజర్‌ స్టార్ట్‌ వాటర్‌ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.75 కోట్లు మంజూరు కాగా, వైరా నది వరద ముంపు సమస్య రాకుండా రూ.65 కోట్లతో చేపట్టే రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇవికాక విద్యుత్‌ అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ వ్యవస్థ కోసం రూ.28 కోట్లతో పనులు జరుగుతున్నాయి. అలాగే, వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించగా, రూ.2 కోట్లతో డిగ్రీ కళాశాల, రూ.4 కోట్లతో జూనియర్‌ కళాశాల నూతన భవనాలు చేపట్టనున్నారు. మధిరలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి రూ.193 ట్లతో టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. ఇక రూ.12 కోట్లతో మధిర చెరువు, రూ.3కోట్లతో మడుపల్లి చెరువు ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుత ఉన్న బస్టాండ్‌ స్థానంలో కొత్త నిర్మాణానికి రూ.9.50 కోట్లు కేటాయించారు. అలాగే, రూ.25 కోట్లతో కోర్టు భవనాల సముదాయం నిర్మించనున్నారు. ఇంకా మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద రూ 50 లక్షలతో స్నానాల ఘాట్‌, రూ.50 లక్షలతో బతుకమ్మ ఘాట్‌ నిర్మాణం, మున్సిపల్‌ పరిధి ఇల్లెందులపాడు, జిలుగుమాడు, అంబారుపేట, మడుపల్లిల్లో రూ.3 కోట్లతో శ్మశాన వాటికల్లో సౌకర్యాల కల్పనకు నిర్ణయించారు.

మరికొన్ని పనులకు ప్రణాళిక

మధిరలో కళాకారులకు అండగా నిలవడంతో పాటు ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేలా సాంస్కతిక కళా కేంద్రం ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా అంబేద్కర్‌ నాలెడ్జి సెంటర్‌, ఐటీ హబ్‌ ఏర్పాటుచేయనున్నట్లు ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అలాగే, డిజిటల్‌ లైబ్రరీ, మడుపల్లిలో ఆధునిక గ్రంథాలయం ఏర్పాటు, చిరు వ్యాపారుల కోసం మినీ షాపింగ్‌ కాంప్లెక్స్‌, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇండస్ట్రియల్‌ పార్క్‌, వృద్ధుల కోసం డే కేర్‌ రిక్రియేషన్‌ సెంటర్‌ ఏర్పాటు కూడా ప్రతిపాదనల్లో ఉన్నాయని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement