ఆలయానికి రూ.10లక్షల విలువైన మకర తోరణం | - | Sakshi
Sakshi News home page

ఆలయానికి రూ.10లక్షల విలువైన మకర తోరణం

Feb 10 2026 7:26 AM | Updated on Feb 10 2026 7:26 AM

ఆలయాన

ఆలయానికి రూ.10లక్షల విలువైన మకర తోరణం

ఏన్కూరు: మండలంలోని నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామికి అలంకరణ కోసం భక్తులు వెండి మకర తోరణం అందజేశారు. ఖమ్మంకు చెందిన నారాయణరెడ్డి దంపతులు మకరతోరణాన్ని సోమవారం అర్చకుడు శ్రీనివాసచార్యులకు అందజేయగా ఆయన స్వామికి అలంకరించారు. కాగా, ఈ తోరణం విలువ రూ.10 లక్షలు ఉంటుందని దాతలు తెలిపారు.

శరవేగంగా సింథటిక్‌ ట్రాక్‌ పనులు

ఖమ్మం స్పోర్ట్స్‌: ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత బ్లాక్‌ చిప్‌ వేయడం పూర్తిచేశారు. రెండో విడత కూడా పూర్తయ్యాక ట్రాక్‌పై రెడ్‌ చిప్స్‌ వేసి చదును చేయనున్నారు. అనంతరం లైన్‌ మార్కింగ్‌ పనులు జరుగుతాయని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు.

20వరకే పత్తి కొనుగోళ్లు

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలోని సీసీఐ కేంద్రాల్లో ఈనెల 20వ తేదీ వరకే పత్తి కొనుగోళ్లు ఉంటాయని అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పత్తి సాగు చేసిన రైతులు కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని కేంద్రాలకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈనెల 21 నుంచి సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేయనున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.

కార్మిక చట్టాలను నిర్వీర్యం చేశారు..

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

ముదిగొండ: కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ముదిగొండ మండలం బాణాపురంలో ఏర్పాటుచేసిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బాజీ హనుమంతుతో పాటు గండ్లూరి కిషన్‌రావు, మొక్క చిన్ననర్సయ్య విగ్రహాలతో పాటు అమరవీరుల స్తూపాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. తొలుత గ్రామంలో ర్యాలీ నిర్వహించగా అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ప్రజాధనాన్ని దోచిపెడుతోందని ఆరోపించారు. అంతేకాక ఎరువులపై సబ్సిడీ తగ్గించి రైతులకు అన్యాయం చేసిందని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారి స్ఫూర్తితో అసమానతలు లేని సమాజం కోసం కార్యకర్తలకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు వనం నర్సింగరావు, పొన్నం వెంకటేశ్వరరావు, రాంబాబు, మన్నేపల్లి సుబ్బారావు, బండి పద్మ, బట్టు పురుషోత్తం, రాయల వెంకటేశ్వర్లు, పాండురంగారావు, కూరపాటి శ్రీనివాసరావు, చింతకాయ రామారావు, కె.తిరుపతి, ఎం.వెంకన్న, ఇరుకు నాగేశ్వరరావు, కె.ఉపేందర్‌ పాల్గొన్నారు.

ఎఫ్‌ఎల్‌ఎస్‌ అమలుపై పరిశీలన

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేషనల్‌ లెర్నింగ్‌ స్టడీ(ఎఫ్‌ఎల్‌ఎస్‌) అమలును రాష్ట్ర బృందం పరి శీలించింది. ఎన్‌సీఈఆర్‌టీ బాధ్యులు భరణి జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లి, ఖమ్మం ఇందిరానగర్‌ పాఠశాలను సోమవారం సందర్శించారు. మూడో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ఎఫ్‌ఎల్‌ఎస్‌ అమలుపై ఆరా తీయడంతో పాటు ఈసీఆర్‌ వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఎంఓ ప్రభాకర్‌రెడ్డి, ఎంఈఓ శైలజలక్ష్మీ, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

ఆలయానికి రూ.10లక్షల విలువైన మకర తోరణం
1
1/2

ఆలయానికి రూ.10లక్షల విలువైన మకర తోరణం

ఆలయానికి రూ.10లక్షల విలువైన మకర తోరణం
2
2/2

ఆలయానికి రూ.10లక్షల విలువైన మకర తోరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement