కాలుష్య రహిత సమాజానికి పాటుపడాలి
తిరుమలాయపాలెం: నానాటికీ పెరుగుతున్న కాలుష్యంతో ఎదురవుతున్న ఇబ్బందులను విద్యార్థులు గుర్తించి కాలుష్య రహిత సమాజ స్థాపనలో పాలుపంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్యజైనీ సూచించారు. గతంలో సుబ్లేడు పాఠశాల పరిశీలన సందర్భంగా విద్యార్థులు ప్లాస్టిక్ బాటిళ్లు వాడుతుండడాన్ని ఆమె గుర్తించారు. దీంతో సొంత ఖర్చుతో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు 120 మందికి స్టీల్ బాటిళ్లు ఆమె సొంత ఖర్చులతో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పి.ప్రభాకర్‌రెడ్డి, హెచ్‌ఎం గోపాల్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులకు స్టీల్‌బాటిళ్లు అందించిన
డీఈఓ చైతన్యజైనీ


