మున్సిపోల్స్‌కు సిద్ధం..
గరిష్టం / కనిష్టం
310 / 160
న్యూస్‌రీల్
ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరిన ఉద్యోగులు
సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు
మళ్లీ ‘సాగర్’ కష్టాలు
సాగర్ కాల్వల ద్వారా వారబందీ విధానంలో నీరు విడుదల చేస్తుండగా చివరి ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగుతున్నారు.
బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
IIలో
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో బుధవారం జరిగే పోలింగ్‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మున్సిపాలిటీల పరిధిలో 117 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఏదులాపురంలో 15వ వార్డు ఏకగ్రీవం కావడంతో 116వార్డుల్లో ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈమేరకు 414మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. 1,41,875మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చ నున్నారు. ఓటర్లలో మహిళలు 74,083 మంది, పురుషులు 67,768 మందితో పాటు ఇతరులు 24 మంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రితో మంగళవారం సాయంత్రంకల్లా కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. సామగ్రి పంపిణీని కలెక్టర్ అనుదీప్ పరిశీలించగా, బందోబస్తుపై పోలీసు ఉద్యోగులకు కమిషనర్ సునీల్‌దత్ సూచనలు చేశారు. కాగా, పోలింగ్ తర్వాత బందోబస్తు నడుమ బ్యాలెట్‌బాక్స్‌లను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించనుండగా, ఈనెల 13న శుక్రవారంఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
ఏర్పాట్లు పూర్తి
ఐదు మున్సిపాలిటీలకు గాను 116 వార్డుల్లో పోలింగ్‌కు అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 240 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటుచేయగా, ఓటర్లకు ఇబ్బందులు ఎదురుకాకుండా తాగునీరు, కుర్చీలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అవసరాలు ఉన్న ఓటర్ల కోసం వీల్‌చైర్లు, సహాయకులను సిద్ధం చేశారు.
ప్రత్యేక బృందాలు
ఎన్నికల విధులకు అవసరమైన ఉద్యోగుల కన్నా 20శాతం ఎక్కువగా కేటాయించారు. పోలింగ్‌కు మొత్తం 240మంది అవసరమైతే 295మందికి శిక్షణ ఇచ్చారు. ఏపీఓలు 295మంది, ఓపీఓలు 910మంది విధులు నిర్వర్తించనున్నారు. అలాగే, 55మంది రిటర్నింగ్ అధికారులు, 60మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. అవసరమైన 482 బ్యాలెట్ బాక్స్‌లకు తోడు 20శాతం అదనంగా అంటే 580 బాక్స్‌లు సమకూర్చారు. అలాగే, ఐదు మున్సిపాలిటీల పరిధిలో 26మంది జోనల్ ఆఫీసర్లు, పదేసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. వీరికి తోడు 35మంది మైక్రో అబ్జర్వర్లు, మరో 38 మంది రూట్ ఆఫీసర్లు ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు.
సామగ్రితో కేంద్రాలకు...
మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు మంగళవారం సామగ్రిని పంపిణీ చేశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పలు కేంద్రాలను పరిశీలించి సూచనలు చేశారు. ఓటర్లకు బ్యాలెట్ పేపర్లు ఇవ్వడం, పీఓ డైరీ నింపడం, పోలింగ్ పూర్తయ్యాక సీల్ వేయడం తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వివరించారు. కాగా, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఉద్యోగులు 58 బస్సుల్లో తమకు కేటాయించిన సెంటర్లకు చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
1,100 మందితో బందోబస్తు
ఎన్నికలకు 1,100మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో నలుగురు అడిషనల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 25 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 975 మంది సిబ్బంది పాల్గొంటారు. ఈమేరకు పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సిబ్బందికి అవగాహన కల్పించారు.
నేడు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు
సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అధికార యంత్రాంగం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇక్కడ జరుగుతున్న పోలింగ్‌ను కలెక్టరేట్‌లోని ప్రత్యేక సెల్ ద్వారా అధికారులు పర్యవేక్షించనున్నారు. మొత్తం పోలింగ్ స్టేషన్లలో 25 సమస్యాత్మక, 32 అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించి వెబ్‌కాస్టింగ్ ఏర్పాటుచేస్తున్నారు. అలాగే, ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా 163 సెక్షన్ అమలు చేస్తున్నారు.
మున్సిపోల్స్‌కు సిద్ధం..
మున్సిపోల్స్‌కు సిద్ధం..
మున్సిపోల్స్‌కు సిద్ధం..
మున్సిపోల్స్‌కు సిద్ధం..


