● అగ్రగామిగా శ్రీ చైతన్య
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్‌తో అగ్రగామిగా నిలిచారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. విద్యార్థులను అభినందించాక వారు వివరాలు వెల్లడించారు. ఎం.అమాన్ శ్రీ సాయి 99.85పర్సంటైల్, వి.విఘ్నేష్ కౌండిన్య 99.74, ఎస్.శ్రీనిధి 99.64, వి.కీర్తి 99.52, వి.స్నేహిత 99.50, సీహెచ్.మోక్షజ్ఞ 99.38, డి.సాయిప్రణవ్ 99.16, బి.ప్రణయ్ విశాల్ 99.05 పర్సంటైల్ సాధించగా ఇంకొందరు కూడా అత్యుత్తమ పర్సంటైల్ సాధించారని తెలిపారు. అకడమిక్ డైరెక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం చేతన్ మాధూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్‌ఆర్‌ఎస్‌డీ.వర్మ, డీన్ జె.కృష్ణ, ఏజీఎంలు సీహెచ్.బ్రహ్మం, జి.ప్రకాష్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


