కోడి పందేలకు వచ్చి మృత్యువాత
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం గ్రామ సమీపంలోని మామిడి తోటలో నిర్వహించిన కోడిపందేల జూదానికి వచ్చి ఓ వ్యక్తి మృత్యువాత పడిన దుర్ఘటన ఈనెల 13న చోటు చేసుకుంది. కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి చేసిన క్రమంలో ఏపీ రాష్ట్రం మైలవరం మండలం గుర్రాజుపాలెం గ్రామానికి చెందిన సుంకర కృష్ణారావు (36) ఆందోళనకు గురై అక్కడ నుంచిపరారవుతూ సమీపంలోని బావిలో ప్రమాదవశాత్తు పడి మృత్యువాత పడ్డాడు. కృష్ణారావు ఆచూకీ కోసం కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించగా.. బావిలో ఉన్న మృతదేహాన్ని శనివారం రాత్రి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య లీలాభవాని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.


