ఓటు వేసి! | - | Sakshi
Sakshi News home page

ఓటు వేసి!

Feb 12 2026 7:36 AM | Updated on Feb 12 2026 7:36 AM

ఓటు వ

ఓటు వేసి!

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్‌ శాతం ఇలా..

కల్లూరులో అత్యధికంగా

87.08 శాతం

చెదురుమదురు ఘటనలు

మినహా పోలింగ్‌ ప్రశాంతం

ఉదయం నుంచే

పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లు

బారులు దీరి..

ఏదులాపురం మున్సిపల్‌ పరిధి తెల్దారుపల్లి కేంద్రంలో క్యూ కట్టిన ఓటర్లు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్‌ జరగగా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్‌ మొదలైనప్పటి నుంచే ఓటర్లు రావడం మొదలైంది. కానీ చాలాచోట్ల మధ్యాహ్నం వరకే ఎక్కువ శాతం పోలింగ్‌ పూర్తయింది. ఇంకొన్ని చోట్ల సాయంత్రం తర్వాత ఓటర్లు రావడంతో 5గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తంగా ఐదు మున్సిపాలిటీల్లో 1,41,875 మంది ఓటర్లకు గాను 1,17,043 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 55,506 మంది పురుషులు, 61,520 మంది మహిళలతో పాటు ఇతరులు 17 మంది ఉన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు వైరా, ఏదులాపురం, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్‌, అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ పలు కేంద్రాల్లో పోలింగ్‌ సరళిని పరిశీలించారు. కాగా, ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా కృషి చేసిన ఉద్యోగులు, సహకరించిన ఓటర్లు, పార్టీల నాయకులు, అభ్యర్థులకు కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అభినందనలు తెలిపారు.

ఉత్సాహంగా వచ్చారు..

ఐదు మున్సిపాలిటీల్లోనూ ఉదయం 7 గంటలకే ఓటర్లు బారులు దీరారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద తాగునీరు, కుర్చీలు ఏర్పాటుచేయడంతో ఇబ్బందులు ఎదురుకాలేదు. అలాగే, దివ్యాంగులకు వీల్‌చైర్లు సమకూర్చి సహాయకులను ఏర్పాటుచేశారు. ఐదు మున్సిపాలిటీల్లో 117 వార్డులకు గాను ఏదులాపురం 15వ వార్డు ఏకగ్రీవం కాగా 116 వార్డుల్లో పోలింగ్‌ జరిగింది. మొత్తం 240 పోలింగ్‌ కేంద్రాల్లో వృద్ధులు, మహిళలు, యువతే కాక దివ్యాంగులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. వైరాలోని 12వ వార్డులో చివరి నిముషంలో ఓ మహిళ రాగా అధికారులు అనుమతించారు.

స్వల్ఫ ఘర్షణలు మినహా..

ఎన్నికల సందర్భంగా పలుచోట్ల స్వల్ప వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వైరాలోని 9వ వార్డులో ఉదయం పోలింగ్‌ కేంద్రం వద్ద సీపీఎం, కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నా కాంగ్రెస్‌ నాయకులు అభ్యంతరం తెలపడంతో పోలీసులు ఇరువర్గాలను శాంతింప చేశారు. ఏదులాపురం 26వ వార్డులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎఎస్‌ వర్గీయులు తమకు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించే క్రమాన బాహాబాహీకి దిగడంతో పోలీసులు చెదరగొట్టారు.

ఓటు వేసిన డిప్యూటీ సీఎం

మధిర మున్సిపాలిటీ 9వ వార్డు ఇందిరా డెయిరీ పోలింగ్‌ కేంద్రంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే, వైరాలోని 5వ వార్డులో ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌, సత్తుపల్లిలోని 18వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి, 12వ వార్డులో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుటుంబీకులతో కలిసి ఓటు వేశారు. అలాగే, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి 14వ వార్డులో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, 22వ వార్డులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గుర్రాలపాడులో సిరా మార్క్‌ చూపిస్తున్న యువతులు

ఐదు మున్సిపాలిటీల్లో 82.50 శాతం పోలింగ్‌

ఓటు వేసి!1
1/14

ఓటు వేసి!

ఓటు వేసి!2
2/14

ఓటు వేసి!

ఓటు వేసి!3
3/14

ఓటు వేసి!

ఓటు వేసి!4
4/14

ఓటు వేసి!

ఓటు వేసి!5
5/14

ఓటు వేసి!

ఓటు వేసి!6
6/14

ఓటు వేసి!

ఓటు వేసి!7
7/14

ఓటు వేసి!

ఓటు వేసి!8
8/14

ఓటు వేసి!

ఓటు వేసి!9
9/14

ఓటు వేసి!

ఓటు వేసి!10
10/14

ఓటు వేసి!

ఓటు వేసి!11
11/14

ఓటు వేసి!

ఓటు వేసి!12
12/14

ఓటు వేసి!

ఓటు వేసి!13
13/14

ఓటు వేసి!

ఓటు వేసి!14
14/14

ఓటు వేసి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement