పకడ్బందీగా కౌంటింగ్
సత్తుపల్లిటౌన్: మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్ స్పష్టం చేశారు. సత్తుపల్లిలోని కౌంటింగ్ కేంద్రంలో గురువారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ కచ్చితమైన సమాచారాన్నే విడుదల చేయాలని పేర్కొన్నారు. ఆ తర్వాత రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడి సూచనలు చేశారు.
మూడంచెల భద్రత :
ఏసీపీ వసుంధర యాదవ్
సత్తుపల్లిటౌన్/కల్లూరురూరల్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సత్తుపల్లి, కల్లూరు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శంగా సాగేలా హాళ్లల్లోకి మొబైళ్లు, పెన్నులు, ఇంక్, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగ్‌లు నిషేధించినట్లు చెప్పారు. అంతేకాక వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపుపై దృష్టి సారించామని తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద సాయుధ పోలీస్ బలగాలతో బందోబస్తు కొనసాగుతోందని ఏసీపీ వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ, అధికారులు రామకృష్ణ, నాగేశ్వరరావు, సీఐ టి.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన
సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్
పకడ్బందీగా కౌంటింగ్


