గౌడ ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు | - | Sakshi
Sakshi News home page

గౌడ ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు

Feb 13 2026 3:46 AM | Updated on Feb 13 2026 3:46 AM

గౌడ ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు

గౌడ ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు

ఖమ్మంఅర్బన్‌: గౌడ సంఘం అభివృద్ధికి ఐక్యతే ప్రధానమని సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణగౌడ్‌, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌ పేర్కొన్నారు. ఖమ్మంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఖమ్మంలో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్‌ (ఆత్మగౌరవ భవనం) నిర్మాణానికి రఘునాథపాలెంలో ప్రభుత్వం 29 గుంటల భూమి కేటాయించగా, గత ఏడాది జూన్‌లో మంత్రులు శంకుస్థాపన చేశారని తెలిపారు. అక్కడ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయిస్తూ జీఓ జారీ చేసిందని చెప్పారు. నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సమావేశంలో గోపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బొల్లకొండ శ్రీనివాసరావుగౌడ్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు వడ్డెబోయిన నర్సింహారావుగౌడ్‌, గూడిద శ్రీనివాసగౌడ్‌, అమరగాని వెంకన్నగౌడ్‌, కత్తి నెహ్రూగౌడ్‌, రుద్గాని ఉపేందర్‌గౌడ్‌, మార్కం లింగయ్యగౌడ్‌, డాక్టర్‌ నారగాని రాంప్రసాద్‌గౌడ్‌, పోతగాని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

పాలాభిషేకం చేసిన నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement