ఉత్సాహంగా ‘అస్మిత’ అథ్లెటిక్స్ టోర్నీ
ఖమ్మంస్పోర్ట్స్: ఖేలో ఇండియా క్రీడల్లో భాగంగా అస్మిత బాలికలకు అథ్లెటిక్స్, కబడ్జీ పోటీలు గురువారం నిర్వహించారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌డీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ పోటీలను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి ప్రారంభించగా, 60 మంది బాలికలు పాల్గొన్నారు. అండర్–17 100 మీటర్ల పరుగులో ఎం.డీ.ఆఫ్రిన్, బి.మైథిలి, బి.దీక్ష, 200 మీటర్ల పరుగులో స్లామామేతాబ్, ఎ.అగ్లీ, టి.అస్మిత, 400 మీటర్ల పరుగులో బి.దీక్ష, ఎం.నందిని, స్లామామేతాబ్, 800 మీటర్లలో సీహెచ్.మీనాక్షి, ఎం.డీ.ఆఫ్రిన్, డి.అభినయ వరుసగా మూడుస్థానాల్లో నిలిచారు. జావెలిన్ త్రోలో ఎస్.శ్రీవల్లి, పి.కీర్తన, వి.నయోమి, షాట్‌పుట్‌లో బి.ఉమామహేశ్వరి, డి.అంజలి, సహస్ర, లాంగ్‌జంప్‌లో ఎం.డీ.ఆఫ్రిన్, బి.మైథిలి, సాల్‌మా మేతాబ్ మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నారు. వీరిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు డీవైఎస్‌ఓ తెలిపారు. అలాగే, కబడ్డీ పోటీల్లో జీళ్లచెరువు ప్రథమస్థానంలో నిలవగా ఖమ్మానికి చెందిన రాజేంద్రనగర్ పాఠశాల విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. కార్యక్రమంలో జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి వై.రామారావు, కబడ్డీ, అథ్లెటిక్స్ అసోసియేషన్ల జిల్లా కార్యదర్శులు కె.క్రిస్టోఫర్‌బాబు, ఎం.డీ.షఫిక్‌అహ్మద్, అథ్లెటిక్స్ కోచ్ ఎం.డీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు.


