ఈ విజయం.. కార్యకర్తలకు అంకితం
ఖమ్మంమయూరిసెంటర్: ఐదు మున్సిపాలిటీల్లో మెజార్టీ వార్డులను గెలవడమే కాక చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ కై వసం చేసుకుందని.. ఈ విజయాన్ని పార్టీ కార్యకర్తలకు అంకితం ఇస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల విజయంతో జిల్లా కాంగ్రెస్ అడ్డా అని మరోసారి రుజువైందన్నారు. పార్టీకిభారీవిజయం అందించిన జిల్లాప్రజలు, కార్య కర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, జిల్లా మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, నాయకులు బొడ్డు బొందయ్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, మొక్క శేఖర్‌గౌడ్, నరేష్‌నాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ


