● హార్వెస్ట్ విజయభేరి
జేఈఈ మెయిన్స్‌లో తమ విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్‌తో సత్తా చాటారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తెలిపారు. కళాశాలలో విద్యార్థులను అభినందించాక వారు మాట్లాడారు. కృష్ణమోహన్ 99.87 పర్సంటైల్, పి.అన్విదరెడ్డి 99.47, కె.లోకేష్ 99.42, బి.స్ఫూర్తి 99.31, ఎం.సాయిచరణ్ 99.04 పర్సంటైల్ సాధించారన్నారు. వీరితో పాటు వి.జగల్, పి.గోవర్ష, ఏ.సుహాని, కృష్ణ మనోజ్ఞ 98పర్సంటైల్‌కు పైగా సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


