రేపు రవాణా శాఖ సేవలకు అంతరాయం | - | Sakshi
Sakshi News home page

రేపు రవాణా శాఖ సేవలకు అంతరాయం

Feb 12 2026 7:36 AM | Updated on Feb 12 2026 7:36 AM

రేపు రవాణా శాఖ  సేవలకు అంతరాయం

రేపు రవాణా శాఖ సేవలకు అంతరాయం

ఖమ్మంక్రైం: జిల్లాలోని అన్ని రవాణా శాఖ కార్యాలయ ఉద్యోగులు ఈనెల 13న(శుక్రవారం) ‘వాహన్‌ పోర్టర్‌’పై శిక్షణ కోసం హైదరాబాద్‌ వెళ్లనున్నారని జిల్లా రవాణా శాఖాధికారి జగదీష్‌ తెలిపారు. ఈమేరకు వైరా యూనిట్‌ కార్యాలయంలో ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవని వెల్లడించారు. ఖమ్మం, సత్తుపల్లి కార్యాలయాల్లో కూడా సేవలు పాక్షికంగా అందుతాయని తెలిపారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి సహకరించాలని డీటీఓ ఓ ప్రకటనలో కోరారు.

నేడు హెచ్‌టీ విద్యుత్‌ వినియోగదారుల సదస్సు

ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం విద్యుత్‌ సర్కిల్‌ పరిధి హెచ్‌టీ, సీటీ మీటర్ల వినియోగదారుల సదస్సు గురువారం నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఖమ్మంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్డులో ఉన్న విద్యుత్‌ గెస్ట్‌హౌస్‌లో సాయంత్రం 3–30 గంటలకు సదస్సు మొదలవుతుందని పేర్కొన్నారు. ఇందులో అకౌంట్స్‌ విభాగం అధికారులు, ఇంజనీర్లు పాల్గొని హెచ్‌టీ, సీటీ మీటర్ల సమస్యలు, అన్‌ బ్లాకింగ్‌ రీడింగ్‌పై అవగాహన కల్పిస్తారని తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలకు వేదికగా ఖమ్మం

ఆర్చరీ, బాల్‌ బ్యాడ్మింటన్‌

సీఎం కప్‌ ఇక్కడే..

ఖమ్మం స్పోర్ట్స్‌: సీఎం కప్‌ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ముగియడంతో వివిధ అంశాల్లో క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈనేపథ్యాన జిల్లాల వారీగా పోటీల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇందులో ఆర్చరీ, బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు ఖమ్మంలో నిర్వహించా లని నిర్ణయించారు. ఈనెల 20నుంచి 22వ తేదీ వరకు ఆర్చరీ, బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు ఇక్క డ జరగనున్నాయి. అలాగే, అథ్లెటిక్స్‌ పోటీలు హనుమకొండలో, జిమ్నాస్టిక్స్‌ కరీంనగర్‌లో, నెట్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌, ఖో–ఖో, కబడ్డీ, బాస్కెట్‌బాల్‌, సెపక్‌తక్రా, సైక్లింగ్‌ పోటీలు మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

పంటల నమోదు గడువు మార్చి 15వరకు..

ఖమ్మంవ్యవసాయం: యాసంగిలో సాగవుతున్న పంటల వివరాల నమోదు గడువును మార్చి 15గా నిర్ణయించారు. కేంద్రప్రభుత్వం నిబంధనల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 4.16 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అయితే, ప్రాజెక్టులు, జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉన్నందున ఈ విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 75వేల ఎకరాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వచ్చేనెల 15లోగా క్లస్టర్ల వారీగా ఏఈఓలు మిగతావి కూడా నమోదు చేయనున్నారని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు.

మెరుగైన వైద్యసేవలు

అందించాలి

కామేపల్లి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని డీఎంహెచ్‌ఓ రామారావు సూచించారు. కామేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించాక రోజువారీ ఓపీ నమోదు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ వేసవి సమీపిస్తున్న నేపథ్యాన సీజనల్‌ వ్యాధులు, వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. హెచ్‌ఈఓ వెంకటేశ్వర్లు, ఉద్యోగులు తనూష, రాధాకృష్ణ, పుష్పలత, తిరుమలయ్య, శ్రీనివాస్‌, రమణ, ఉష, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రమణీయంగా

రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం రమణీయంగా సాగింది. తొలుత గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరా ధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి పూజలు చేశాక స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement