కబడ్డీ టోర్నీ విజేత ఖమ్మం జట్టు
చింతకాని: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని నేరడలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యాన నిర్వహించిన రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీల్లో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో విజేతలకు మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో వైరా ఏసీపీ సారంగపాణి బహుమతులు అందజేశాక మాట్లాడారు. గ్రామీణ క్రీడలు, క్రీడాకారులను అందరూ ప్రోత్సహించాలని సూచించారు. కాగా, టోర్నీలో ఖమ్మం జట్టు ప్రథమ స్థానంలో నిలిచి రూ.50 వేల నగదు బహుమతి గెలుకుంది. ఆతర్వాత రెండు నుంచి తొమ్మిదో స్థానం వరకు కల్లూరు, కాకినాడ, కొత్తగూడెం, చెరువుమాధారం, నేరడ, బయ్యారం, బర్ఖత్‌గూడెం, విజయవాడ జట్లు నిలవగా నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు. నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు, సర్పంచ్ దూసరి నేతాజీ, ఎస్సై వీరేందర్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు భాగం హేమంతరావు, జమ్ముల జితేందర్‌రెడ్డి, పావులూరి మల్లికార్జున్‌రావు, దూసరి శ్రీరాములు, మడుపల్లి భాస్కర్, కొప్పుల గోవిందరావు, మంకెన నాగేశ్వరరావు, దూసరి గోపాలరావు, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


