● శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం | - | Sakshi
Sakshi News home page

● శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం

Feb 15 2026 6:58 AM | Updated on Feb 15 2026 6:58 AM

● శ్ర

● శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం

● శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం

వైరారూరల్‌: వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ఏటా మాదిరిగానే మహాశివరాత్రి సందర్భంగా కల్యాణం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర స్వామి భద్రాచలం వెళ్తూ లక్ష్మీపురంలోని వైరా నదిలో స్నానం చేశాక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. శ్రీరాముడు స్నానమాచరించిన ప్రదేశం కాలక్రమేణా రామగుండంగా ప్రసిద్ధి చెందింది. దీంతో మహాశివరాత్రి వేడుకల్లో లక్షలాది మంది భక్తులు వైరా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ మేరకు ఐదు రోజుల పాటు జరిగే జాతరకు ఏర్పాట్లు చేశారు. కాగా, ఆదివారం రాత్రి జరిగే కల్యాణంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు పాల్గొననున్నారు. కాగా, జాతర చరిత్రలో తొలిసారి చిన్నాపెద్దను ఆకట్టుకునేలా జాయింట్‌ వీల్‌, బ్రేక్‌డాన్స్‌, డ్రాగన్‌ ట్రెయిన్‌ తదితరాలు ఏర్పాటు చేశారు. అంతేకాక భక్తుల పుణ్యస్నానాల కోసం ఘాట్ల నిర్మాణం, రూ.1.05 లక్షలతో శివపార్వతుల కల్యాణ వేదిక నిర్మించారు. ఇక వైరా ఏసీపీ ఎస్‌.సారంగపాణి ఆధ్వర్యాన వైరా సీఐ వెంకటప్రసాద్‌, ఎస్‌ఐలు పుష్పాల రామారావు, వెంపటి పవన్‌కుమార్‌తో పాటు 100మందికి పైగా బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. కాగా, జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈఓ హరి చంద్రశేఖరశర్మ వెల్లడించారు.

● శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం 1
1/1

● శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement