ప్రతీ విద్యార్థి చదివేలా బోధన
ఖమ్మం సహకారనగర్: ప్రాథమిక స్థాయిలోనే ప్రతీ విద్యార్థి చదివేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలని అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె ఏడు మండలాల ఎంఈఓలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి చదివేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈమేరకు అనువైన అభ్యసన ప్రక్రియలు ఎంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అనంతరం ఎవ్రీ చైల్డ్ రీడ్(ఈసీఎఆర్)పై పలు సూచనలు చేశారు. ఈసమావేశంలో డీఈఓ చైతన్యజైనీ, ఏఎంఓ పెసర ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లాలోని 28 పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో డీఈఓ చైతన్య జైనీ సమావేశమై అందిన నిధులు, చేపడుతున్న పనులపై సమీక్షించారు.


