నేటి నుంచి బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ

Feb 10 2026 7:27 AM | Updated on Feb 10 2026 7:27 AM

నేటి

నేటి నుంచి బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్‌లో మంగళవారం నుంచి ఐఈఎల్‌టీఎస్‌ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ జి.శ్రీలత తెలిపారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 10గంటల్లోగా స్టడీసర్కిల్‌కు చేరుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోని వారు కూడా మంగళవారం నేరుగా రావొచ్చని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 08742–230848, 94419 3135 9 నంబర్లలో సంప్రదించాలని ఆమె తెలిపారు.

పీఆర్‌టీయూతోనే

సమస్యల పరిష్కారం

ఖమ్మం సహకారనగర్‌/మధిర: ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలు పీఆర్‌టీయూతోనే పరిష్కారమవుతాయని యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టా శేఖర్‌రావు, ఆర్‌.రంగారావు పేర్కొన్నారు. యూనియన్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవా రం ఖమ్మం, మధిరలో జరిగిన సమావేశాల్లో పతాకాలు ఆవిష్కరించాక మాట్లాడారు. ప్రతీ ఉపాధ్యాయుడు గర్వపడేలా విధంగా తమ సంఘం పనిచేస్తుందని, రాష్ట్రంలో 75 వేల సభ్యత్వంతో ప్రథమ స్థానాన ఉందని తెలిపా రు. ఈ కార్యక్రమాల్లో యూనియన్‌ నాయకులు షేక్‌ మదార్‌, ఆర్‌.బ్రహ్మరెడ్డి, చిలుకూరి సత్యనారాయణరెడ్డి, పోలే సుధాకర్‌, రవికుమార్‌, కొమ్ము శ్రీనివాసరావు, డి.వెంకటేశ్వరరావు, తూమాటి కృష్ణారెడ్డి, కోట జయరాజు, బూసా కోటేశ్వరావు, కొలగాని ప్రసాదరావు, పిల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

రూ.4 కోట్ల విలువైన

గంజాయి దహనం

ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లాలో నమోదైన 47 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 953 కేజీల గంజాయిని ఎకై ్సజ్‌ పోలీసులు సోమవారం దహనం చేశారు. తల్లాడ మండలం గోపాల్‌రావుపేటలో ఈ గంజాయిని కాల్చివేయగా, దీని విలువ రూ.4 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని 21 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 194 కేజీలు, భద్రాద్రి జిల్లాలోని 47 కేసుల్లో పట్టుబడిన 760 కేజీల గంజాయిని దహనం చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఎకై ్సజ్‌ అధికారి నాగేందర్‌రెడ్డి, ఏఈఎస్‌లు పాల్గొన్నారు.

నేటి నుంచి బీసీ  స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ
1
1/1

నేటి నుంచి బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement