64వేల మంది రైతులకు సన్నధాన్యం బోనస్‌ | - | Sakshi
Sakshi News home page

64వేల మంది రైతులకు సన్నధాన్యం బోనస్‌

Feb 18 2026 7:00 AM | Updated on Feb 18 2026 7:00 AM

64వేల మంది రైతులకు సన్నధాన్యం బోనస్‌

64వేల మంది రైతులకు సన్నధాన్యం బోనస్‌

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలో ఖరీఫ్‌ 2025–26 సీజన్‌కు సంబంధించి సన్న ధాన్యం అమ్మిన రైతులకు బోనస్‌ చెల్లింపులు పూర్తయ్యాయని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలి పారు. ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌గా ప్రభుత్వం జమ చేస్తోందని వెల్లడించారు. ఈమేరకు జిల్లాలో 64,093 మంది రైతులకు రూ.175.69 కోట్ల నగదు బోనస్‌ వారి ఖాతాల్లో జమ అయిందని కలెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

పీఎంకేవీవై కోర్సుల్లో

ప్రవేశాలు

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మంలోని ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(పీఎంకేవీవై) పథకం ద్వారా మూడు నెలల కాల పరిమితితో వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్‌ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. పదో తరగతి అర్హతతో సీఎన్‌సీ టర్నింగ్‌ ఆపరేటర్‌, డ్రోన్‌ టెక్నీషియన్‌ కోర్సులు ఉన్నాయని వెల్లడించారు. ఒక్కో కోర్సులో 30సీట్లు ఉంటాయని, ఆసక్తి ఉన్న విద్యార్థులు పదో తరగతి మెమో, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, పాస్‌ఫొటోతో ఈనెల 21వ తేదీ వరకు కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 99493 40417 నంబర్‌లో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ ఓ ప్రకటనలో సూచించారు.

గోదాం నిర్మాణానికి

ఐదెకరాల భూమి

ఖమ్మంఅర్బన్‌: తెలంగాణ స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా గోదాం నిర్మాణానికి ఐదెకరాల ప్రభుత్వ భూమి కేటాయించనున్నారు. విత్తన గిడ్డంగుల కార్పొరేషన్‌ అవసరాల దృష్ట్యా గోదాం నిర్మాణానికి ఖమ్మం నగర పరిధి అల్లీపు రం వద్ద సర్వే నంబర్‌ 241లో ఈ భూమిని గుర్తించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో భూమి పత్రాలు అప్పగిస్తామని పేర్కొన్నారు. గోదాం నిర్మాణం పూర్తయితే రైతుల పంటల నిల్వ, విత్తనాలు భద్రపర్చడం సులువవుతుందని వెల్లడించారు.

శివాలయం హుండీ ఆదాయం రూ.13.74 లక్షలు

కూసుమంచి: కూసుమంచిలోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. ఈమేరకు రూ.13,74,734 ఆదాయం సమకూరింది. ఇది గత ఏడాది కంటే రూ.1,44,559 అదనమ ని అధికారులు తెలిపారు. దేవాదాయ శాఖ అధి కారులు లెక్కింపును పర్యవేక్షించగా, సర్పంచ్‌ కొండా కృష్ణవేణి, ఆలయ చైర్మన్‌ రేలా ప్రదీప్‌ రెడ్డి, ఈఓ కాముని శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

ఆర్టీసీకి నీలాద్రి ఆదాయం రూ.84.44 లక్షలు

సత్తుపల్లిటౌన్‌: మహాశివరాత్రి సందర్భంగా పెనుబల్లి మండలంలోని నీలాద్రి జాతరకు వెళ్లే భక్తుల కోసం సత్తుపల్లి డిపో ద్వారా ప్రత్యేక బస్సులు నడిపించారు. ఈనెల 15వ తేదీ తెల్లవారుజాము నుంచి 16వ తేదీ ఉదయం వరకు 26 బస్సులతో 171 ట్రిప్పులు నడిపించగా రూ.84.44 లక్షల ఆదాయం లభించిందని డిపో మేనేజర్‌ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. ఇది గతేడాదితో పోలిస్తే రూ.26వేలు అదనమని పేర్కొన్నారు. జాతరకు 9,113 కి.మీ. మేర బస్సులు నడవగా 14,127 మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని, మొత్తం 23,422 మంది ప్రయాణించారని తెలిపారు. ఈసమావేశంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌, మెకానికల్‌ ఇంజనీర్‌ సాహితి పాల్గొన్నారు.

‘సౌర విద్యుత్‌’ పనుల్లో మరింత వేగం

బోనకల్‌: జిల్లాలో సౌర విద్యుత్‌ పథకం పనుల్లో వేగం పెంచాలని ఎన్పీడీసీఎల్‌ సీఈలు వెంకటరమణ, కె.రాజుచౌహాన్‌ ఆదేశించారు. బోనకల్‌లో మంగళవారం నిర్వహించి సమీక్షలో వారు మాట్లాడుతూ జిల్లాలో మోడల్‌ సోలార్‌ పథకం కింద గృహ వినియోగదారుల కోసం 2కిలోవా ట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు, వ్యవసాయ మోటార్ల కోసం 7.5 కిలోవాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు ఏర్పాటుచేయాల్సి ఉంటుందని తెలిపా రు. ఈమేరకు పనుల్లో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వేగంపెంచాలని సూచించారు. ఖమ్మం ఎస్‌ఈ ఈ.శ్రీనివాసాచారి, రెడ్‌కో జిల్లా మేనేజర్‌ అజయ్‌, ఉద్యోగులు సత్యనారాయణ, బి.శ్రీనివాసరావు, వై.వీ.ఆనంద్‌కుమార్‌, అనురాధ, టి.మనోహర్‌, హరిప్రవీణ్‌, ఏఇలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement