సాగునీటి కోసం ఎన్నెస్పీ కార్యాలయం ముట్టడి
తల్లాడ: వారబందీ విధానంతో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు వెంటనే నీరు విడుదల చేయాలనే డిమాండ్‌తో తల్లాడలోని ఎన్నెస్పీ డివిజన్ కార్యాలయం వద్ద సోమవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. అన్నారుగూడెం, గోపాలపేట, తల్లాడ, నరసింహారావుపేట, అంజనాపురం, గాంధీనగర్ తండా, బిల్లుపాడు పొలాల కోసం సిరిపురం మేజర్ కాల్వ పరిధి మైనర్లు, మేజర్లకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈక్రమాన రైతులు కార్యాలయాన్ని ముట్టడించగా ఉద్యోగులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ కార్యాలయానికి తాళం వేశారు. ఆతర్వాత కల్లూరు ఎన్నెస్పీఇ ఈఈతో రైతు సంఘం నాయకుడు సేలం సత్యనారాయణరెడ్డి ఫోన్‌లో మాట్లాడి తక్షణమే నీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, నాయకులు నల్లమోతు మోహన్‌రావు, అయినాల రామలింగేశ్వరరావు, అక్కల హరీష్‌రెడ్డి, పులి కృష్ణయ్య, గుండ్ల నాగయ్య, శనక్కాయల నర్సింహారావు, ఏగుపాటి హన్మంతరావు, పాలవెల్లి ప్రసాద్, సాయిని ప్రకాష్‌రావు, అనుములు కృష్ణయ్య, దగ్గుల భద్రారెడ్డి, బోడ లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.


