కేసీఆర్ పాలనలోనే సుభిక్షంగా రాష్ట్రం
ఖమ్మం వైద్యవిభాగం/కామేపల్లి: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండడమే కాక అభివృద్ధి పథంలో పయనించిందని ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. కామేపల్లి మండలం తాళ్లగూడెం ఉపసర్పంచ్ శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యాన మంగళవారం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడంతో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించడంతో పాటు ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఆతర్వాత కొత్తలింగాల కోటమైసమ్మతల్లి దేవాలయంలో నాయకులు పూజలు చేశారు. ఇక ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి తాతా మధు కేక్ కట్ చేశారు. అలాగే, జీవనసంధ్య వృద్ధాశ్రమంలో బీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్‌బాబు ఆధ్వర్యాన పండ్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, నాయకులు, ప్రజాప్రతినిధులు నాగండ్ల కోటేశ్వరరావు, దండా జ్యోతిరెడ్డి, మక్బూల్, బచ్చు విజయ్‌కుమార్, బత్తుల మురళీప్రసాద్‌రావు, చిరుమామిళ్ల రవికిరణ్, వాంకుడోత్ సురేష్, అజ్మీరా వీరునాయక్, పిన్ని కోటేశ్వరరావు, మెంటం రామారావు, మాటేటి కిరణ్, కొల్లు పద్మ, షేక్ ఉస్మాన్, వీరేంద్రగౌడ్, కంచర్ల దయాకర్, కొమ్ము విజేత, తీర్థాల చిదంబరరావు, ఆంతోటి అచ్చయ్య, వడియాల కృష్ణారెడ్డి, మల్లెంపాటి శ్రీనివాసరావు, మూడ్ కృష్ణప్రసాద్‌నాయక్, సామా మోహన్‌రెడ్డి, కాట్రాల రాంబాబు, యలమద్ది అప్పారావు, పుచ్చకాయల బాబు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌ను కలిసిన ఎంపీ వద్దిరాజు
ఖమ్మం వైద్యవిభాగం: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మంగళవారం కలిశారు. ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్‌ను కలిసిన ఆయన పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ తాతా మధు
కేసీఆర్ పాలనలోనే సుభిక్షంగా రాష్ట్రం
కేసీఆర్ పాలనలోనే సుభిక్షంగా రాష్ట్రం


