స్నేహబంధానికి అండగా...
కూసుమంచి: ఆపదలో ఉన్న స్నేహితుల కుటుంబాలకు పలువురు అండగా నిలిచి స్నేహబంధాన్ని చాటారు. ఒకే పాఠశాలలో చదువుకున్న తమ మిత్రుల కుటుంబాలకు ఆపద ఎదురైందని ఆర్థిక సాయం అందించి మన్ననలు అందుకున్నారు. కూసుమంచి మండలం పోచారం శివారు సీతారాంపురం గ్రామానికి చెందిన నక్కల మల్లికార్జున్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన తిరుమలాయపాలెం మండలం బీరోలు ఉన్నత పాఠశాలలో 2006–07లో పదో తరగతి పూర్తిచేశాడు. ఈమేరకు మల్లికార్జున్‌తో చదువుతుకున్న వివిధ గ్రామాల మిత్రులు రూ.50వేలు సేకరించి సోమవారం ఆయన కుటుంబీకులకు అందజేశారు. ఈకార్యక్రమంలో గ్రామపెద్దలు పాల్గొన్నారు.
బాణాపురం పూర్వవిద్యార్థులు..
ముదిగొండ: మండలంలోని బాణాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2002లో పదో తరగతి పూర్తిచేసిన నాగరాజు, సుధాకర్ ఇటీవల మృతి చెంచారు. దీంతో వారి స్నేహితులు రూ.40వేలు సేకరించి ఒక్కొక్కరి కుమార్తె చదువు కోసం రూ.20 వేల చొప్పున సోమవారం అందజేశారు. ఈకార్యక్రమంలో కిషోర్, పిరోజ్, నరేష్, సోమాజీ, బాలకృష్ట, రామకృష్ట, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
చికిత్సకు చేయూత..
తల్లాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో మోకాలికి సర్జరీ చేయించుకున్న తేల్లూరి బాలకృష్ణకు ఆయన స్నేహితులు సోమవారం రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల గొల్ల గూడెం నుంచి తల్లాడ వెళ్తుండగా బాలకృష్ణ గాయపడ్డాడు. ఆయన కు శస్త్రచికిత్స జరగడంతో 2005లో పదో తరగతి బ్యాచ్‌మేట్లు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండ్ల బాలకృష్ణ, గుండ్ల రమేష్, ఇస్నేపల్లి నాగేశ్వర్‌రావు, చల్లా మురళి తదితరులు పాల్గొన్నారు.
స్నేహబంధానికి అండగా...
స్నేహబంధానికి అండగా...


