ముగిసిన జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడాపోటీలు ముగిశాయి. రెండో రోజైన బుధవారం హ్యాండ్‌బాల్, ఉషూ, కరాటే, జూడో పోటీలు నిర్వహించారు. పోటీలకు జిల్లావ్యాప్తంగా 245మంది క్రీడాకారులు హాజరుకాగా, ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. పోటీలను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి పర్యవేక్షించారు. కాగా, ఈనెల 18నుంచి జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో పాల్గొనే జట్లతో వెళ్లేందుకు కోచ్‌లు, మేనేజర్లను ఎంపిక చేయనున్నట్లు డీవైఎస్‌ఓ తెలిపారు.


