శ్రీ వైష్ణవ సేవా సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
ఖమ్మంగాంధీచౌక్ : శ్రీవైష్ణవ సేవా సంఘం జిల్లా కమిటీని ఆదివారం నగరంలోని పీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ మూడేళ్ల పాటు కొనసాగనుంది. జిల్లా అధ్యక్షులుగా నల్లాన్‌చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, కార్యనిర్వహక అధ్యక్షులుగా తూపురాని మధుసూదనాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా కొదమసింహం రవికిరణాచార్యులు, కోశాధికారిగా వేదాంతం ఫణి, కన్వీ నర్‌గా మరింగంటి భార్గవాచార్యులు, ఉపాధ్యక్షులు గా పల్లెర్లమూడి సౌందర్యరాజన్‌లను ఎన్నుకున్నామని, పూర్తి కార్యవర్గాన్ని త్వరలో ఎన్నుకుంటామ ని శ్రీనివాసాచార్యులు తెలిపారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు శేషబట్టర్ రఘునాథాచా ర్యులు, రాష్ట్ర జేఏసీ కమిటీ సభ్యులు నల్లాన్‌చక్రవర్తుల రామకృష్ణమాచార్యులు పాల్గొన్నారు.


