అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
వైరారూరల్: మండలంలోని స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం స్వగ్రామైన స్నానాల లక్ష్మీపురంలో శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం, వేదిక తదితర పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూనే త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. ఆతర్వాత మహాశివర్రాతి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జాతర సమీపించినందున వైరా నదిలో పూడికతీత, పిచ్చి చెట్లు తొలగించి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేలా రిజర్వాయర్ నుండి నీరు విడుదల చేయాలన్నారు. అలాగే, జాతరకు హాజరయ్యే భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని శాఖల ఆధ్వర్యాన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, సర్పంచ్‌లు నూతి వెంకటేశ్వర్లు, తడికమళ్ల నాగార్జున, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క


