కాంగ్రెస్‌కు ఓట్ల సునామీ!
మెజార్టీ వార్డుల్లో అత్యధిక ఓట్లు ఆ పార్టీకే.. రెండో స్థానాన నిలిచిన బీఆర్‌ఎస్ ‘గూడెం’ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు 35.5 శాతం ఓట్లు ఇక్కడ ఓట్లలో సీపీఐకి రెండో స్థానం
ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల వివరాలు
ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఓట్ల సునామీ సృష్టించింది. దీంతో ప్రతిపక్షాలకు పరిమిత స్థాయిలోనే వార్డులు దక్కాయి. హోరాహోరీ పోరు ఉంటుందని భావించినా అన్నిచోట్ల కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుచుకుంది. మొత్తం ఓట్లలో 50.07 శాతం ఓటింగ్‌ను ఆ పార్టీ సాధించడం గమనార్హం. ఇక బీఆర్‌ఎస్ చెప్పుకోదగ్గ స్థాయిలో వార్డులను దక్కించుకోలేకున్నా, మిగిలిన పార్టీలతో పోలిస్తే గణనీయమైన ఓటింగే సాధించింది. ఆ పార్టీ 34 శాతం ఓట్లతో రెండో స్థానాన నిలిచింది. ఇక ప్రధాన సీపీఎంకు 4.1 శాతం, బీజేపీకి కేవలం రెండు శాతం, సీపీఐకి 1.3 శాతం ఓట్లే దక్కాయి. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
మొత్తం పోలైన ఓట్లు
కాంగ్రెస్
1,52,722
77,552
50.7%
‘చేయి’ఎత్తి జై కొట్టిన ఓటర్లు
ఏదులాపురం, సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో 163 వార్డులకు గాను 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 50.7 శాతం ఓట్లు సాధించి అన్ని మున్సిపాలిటీలను స్వీప్ చేసింది. మొత్తం మున్సిపాలిటీల్లో 1,52,722 ఓట్లు పోలైతే అందులో కాంగ్రెస్‌కే 77,552 ఓట్లు వచ్చాయి. అత్యధికంగా ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. ఇక్కడ పార్టీకి 18,667 ఓట్లు దక్కాయి. ఇక సత్తుపల్లిలో 23 వార్డులుకు గాను 17 గెలవగా, 11,949 ఓట్లు లభించాయి.
బీఆర్‌ఎస్.. 52 వేలు
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఆశించిన మేర రాణించలేదు. అయితే, వార్డులు దక్కకున్నా గౌరవప్రదమైన స్థాయిలోనే ఓట్లు సాధించింది. మొత్తం మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ 26వార్డులు గెలవగా, 34 శాతంతో 52,457 ఓట్లు నమోదయ్యాయి. ఏదులాపురం మున్సిపాలిటీలో 32వార్డులు ఉండగా, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు 9,950 ఓట్లు రాగా రెండు చోట్ల మాత్రమే గెలిచారు. ఇక 23 వార్డులు ఉన్న సత్తుపల్లిలో 9,391ఓట్లు రాగా ఆరు స్థానాలు దక్కాయి. కల్లూరు మున్సిపాలిటీలో 20వార్డులకు గాను ఏడింట నెగ్గగా, 7,487 ఓట్లు సాధించింది. వైరాలోని 20 వార్డుల్లో 9,272 ఓట్లు సాధించినా ఐదు సీట్లకే పరిమితమైంది.
వెనుకబడిన కామ్రేడ్లు
ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు వెనుకపడగా కంచుకోటల్లోనూ ఓటమి ఎదురైంది. మొత్తంగా సీపీఐ నాలుగు, సీపీఎం మూడు వార్డులకే పరిమితమయ్యాయి. ఏదులాపురంలో సీపీఎం రెండు, సీపీఐ మూడు వార్డుల్లో గెలవగా వైరాలో చెరో వార్డు గెలుచుకున్నాయి. అన్నిచోట్ల కలిపి సీపీఐకి 1,978, సీపీఎంకు 6,407 ఓట్లు వచ్చాయి. ఏదులాపురంలోని 32వార్డులకు సీపీఐ ఏడు చోట్ల పోటీ చేస్తే 2,528 ఓట్లు సాధించింది. సీపీఎం ఎనిమిది వార్డుల్లో పోటీ చేయగా 3,611 ఓట్లు నమోదయ్యాయి. ఇక వైరాలో సీపీఐ రెండు వార్డుల్లో బరిలో నిలిస్తే 939, సీపీఎం మూడు వార్డుల్లో బరిలో నిలిచి 1,435 ఓట్లు పొందింది. మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో సీపీఎం 4.1 శాతం, సీపీఐ 1.9 శాతం ఓట్లు సాధించగలిగారు. అలాగే, బీజేపీ అంతగా ప్రభా వం చూపలేదు. మొత్తం ఓట్లలో కేవలం 3,046 ఓట్లు సాధించగా రెండు శాతంగా నమోదైంది.
కార్పొరేషన్‌లో పోటాపోటీ
కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ – సీపీఐ మధ్య పోటా పోటీ నెలకొంది. ఇక్కడ రెండు పార్టీలు 22వార్డులను గెలుచుకున్నట్లుగానే, ఓట్లను కూడా పార్టీలు పంచుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 58 డివిజన్లలో పోటీ చేయగా 35,532 ఓట్లు(35.37 శాతం) నమోదయ్యాయి. సీపీఐ 57 డివిజన్లలో బరిలోకి దిగితే 34,398 ఓట్లు దక్కాయి. ఇక బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఆ పార్టీ 60 డివిజన్లలో పోటీ చేసినా 12.29 శాతంతో 12,355 ఓట్లు సాధించింది. అలాగే, బీజేపీ కేవలం 1.42 శాతంతో 1,430 ఓట్లు పొందింది.
‘చేయి’ గుర్తుకు మున్సిపాలిటీల్లో 50శాతం ఓట్లు
కాంగ్రెస్‌కు ఓట్ల సునామీ!
కాంగ్రెస్‌కు ఓట్ల సునామీ!
కాంగ్రెస్‌కు ఓట్ల సునామీ!
కాంగ్రెస్‌కు ఓట్ల సునామీ!
కాంగ్రెస్‌కు ఓట్ల సునామీ!
కాంగ్రెస్‌కు ఓట్ల సునామీ!
కాంగ్రెస్‌కు ఓట్ల సునామీ!
కాంగ్రెస్‌కు ఓట్ల సునామీ!
కాంగ్రెస్‌కు ఓట్ల సునామీ!
కాంగ్రెస్‌కు ఓట్ల సునామీ!
కాంగ్రెస్‌కు ఓట్ల సునామీ!


