ధూమ్‌ధామ్.. యువజనోత్సవం
ఖమ్మం రాపర్తినగర్: గురుగుల బొమ్మలు ఎల్లమ్మా... గుళ్లల్లో దీపాలు ఎల్లమ్మా... ఏడికిపోతవ్ ఎల్లమ్మా అంటూ సాగిన పలు జానపద పాటలకు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు చేసిన నృత్యాలు ఉర్రూతలూగించాయి. ఉమ్మడి జిల్లా స్థాయి యువజనోత్సవాన్ని ఖమ్మంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించగా వివిధ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తొలుత యువజనోత్సవాన్ని కాకతీయ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థి దశలోనే సేవాదృక్ఫథం అలవడేలా ఎన్‌ఎస్‌ఎస్ దోహదం చేస్తుందని తెలిపారు. ఈమేరకు వలంటీర్లు సామాజిక రుగ్మతల నిర్మూలనలో పాలుపంచుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన మేడారం జాతరలో వందల సంఖ్యలో వలంటీర్లు విశేష సేవలు అందించారని కొనియాడారు. ఎన్‌ఎస్‌ఎస్ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కోఆర్డినేటర్లు ఎన్.శ్రీనివాసరావు, కామేశ్వరరావు మాట్లాడుతూ వలంటీర్లకు యువజనోత్సవం మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ కాటేపల్లి నవీన్‌బాబు, ప్రిన్సిపాల్ వి.రామారావు, ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు జి.విల్సన్, శివకుమార్, ఆర్.వీ.ఎస్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే...
ఉమ్మడి జిల్లాస్థాయి యువజనత్సవంలో భాగంగా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించగా విజేతల వివరాలిలా ఉన్నాయి. వక్తృత్వ పోటీల్లో కె.భరణిసాయి, ఎం.డీ అస్మా, డిబేట్‌లో సీహెచ్.అశ్విని, ఈ.తేజస్వి, వ్యాసరచనలో బి.వినయ్‌శ్రీ, వి.లక్ష్మి శ్రీజ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక క్విజ్‌లో పి.నీరజ్‌కుమార్, పి.చరణ్‌తేజ, కె.భార్గవ్, బి.ప్రసన్నకుమార్, కె.మౌనిక, డి.శ్రుతి విజేతలుగా నిలిచారు. జాతీయ గీతం ఆలాపనలోఎస్.కే.రిజ్వానా, కె.అక్షయ్, రంగోలీలో వి.తేజస్విని, ఉష, పోస్టర్ పెయింటింగ్‌లో ఎం.డీ.అయేషి, ఈ.స్వాతి, మోనోలో ఎం.డీ.ఫరీన్ బేగం, పి.రమ్య భారతి, సోలో వాయిద్యంలో కె.నాగేంద్ర, ఎం.ఉపేందర్, సోలో సాంగ్‌లో సీహెచ్.కీర్తిప్రసన్న, పి.దుర్గాభవాని, శాసీ్త్రయనృత్యంలో నిఖిత, జి.దుర్గ మొదటి రెండేసి స్థానాలు దక్కించుకున్నారు. ఇక బృంద నృత్యంలో ఖమ్మం ప్రియదర్శిని కాలేజీ, నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బహుమతులు గెలుచుకున్నారు. ఇక జూనియర్ కళాశాలల విభాగం వ్యాసరచన పోటీల్లో డి.హరిణి, జి.దేవి, క్విజ్‌లో నాగులవంచ, బోనకల్ బృందాలు, రంగోలిలో బి.లిందుమతి, జి.గౌతమి, పోస్టర్ పెయింటింగ్‌లో డి.ఇందు, జి.జస్వంతి మొదటి రెండు స్థానాల్లో నిలవగా బృంద నృత్యంలో నాగులవంచ వలంటీర్లుగా విజేతగా నిలిచారు.
ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలు
ధూమ్‌ధామ్.. యువజనోత్సవం


