వెటరన్ క్రీడాకారుల సత్తా
ఖమ్మం స్పోర్ట్స్: హైదరాబాద్‌లోని బ్యాడ్మింటన్ అకాడమీలో ఈనెల 14నుంచి 16వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఖమ్మంకు చెందిన క్రీడాకారులు ప్రతిభ చాటారు. ఈమేరకు నర్సయ్య, కిషన్‌రావు 75 ఏళ్ల కేటగిరీలో డబుల్స్‌లో ప్రథమస్థానం సాధించగా, చావా వెంకటేశ్వరరావు, సైదయ్య 65 ఏళ్ల కేటగిరీలో డబుల్స్‌లో ద్వితీయస్థానాన నిలిచారు. అంతేకాక జాతీయస్థాయి పోటీలకు నర్సయ్య, కిషన్‌రావులు ఎంపికయ్యారు. క్రీడాకారులను బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.వెంకట్రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి వీరభద్రం, వి.చంద్రశేఖర్ అభినందించారు.
వెటరన్ క్రీడాకారుల సత్తా


