అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
రఘునాథపాలెం: మండలంలోని చెరువుకొమ్ము తండాకు చెందిన కౌలు రైతు భూక్యా లక్ష్మా(40) కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. అయితే, పంటలు దెబ్బతినడంతో అప్పులు మిగిలిపోగా మద్యానికి బానిసైన లక్ష్మా జనవరి 13న గడ్డి మందు తాగాడు. దీంతో కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఘటనపై లక్ష్మా భార్య చంద్రావతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.


