ఫుడ్ ఫెస్టివల్.. వేరే లెవల్
ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌లో
ఆహారపు అలవాట్లపై అవగాహన
ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ ప్రదర్శన
ఖమ్మం సహకారనగర్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలామంది తమ ఆహారపు అలవాట్లలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల అనారోగ్యపాలవుతున్నట్లు ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ఈ సమయంలో నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జంక్‌ఫుడ్ వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ, తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించేలా ఇటీవల ఫుడ్‌ఫెస్టివల్‌ను సైతం నిర్వహించారు.
హడావుడిగా..
మారుతున్న పరిస్థితుల్లో అనేక మంది హడావుడిగా తినడంతో వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. ప్రధానంగా ఉబకాయం, మధుమేహం, గుండెపోటు వంటి సమస్యలతో యువత బాధపడుతుండగా.. మంచి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తపై ఫుడ్ ఫెస్టివల్ ఎంతో ఉపకరించింది.
వినూత్న ప్రదర్శన..
జంక్‌ఫుడ్‌లు తినకుండా పండ్లు, కూరగాయలు రసాయనాలు ఉపయోగించని ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉండొచ్చనే అంశాన్ని తెలియజేసేందుకు విద్యార్థులు వినూత్నంగా ఫుఢ్‌ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఇందులో ప్రధానంగా హెర్బల్ టీ, జొన్న ఉప్మా, మిల్లెట్ పిజ్జా, హెర్బల్ పానియాలు, కొర్రల పాయసం తదితర పదార్థాలు ఫుడ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా అందరిని ఆకట్టుకున్నాయి. ఏక్యుఏసీ, మైక్రో బయాలజీ, గర్ల్స్ సెఫ్టీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
జంక్ ఫుడ్ వద్దు..
స్వచ్ఛమైన ఫుడ్ ముద్దు
ఫుడ్ ఫెస్టివల్.. వేరే లెవల్


