త్వరలో రుద్రంపూర్ బొల్లిగుట్ట కనుమరుగు
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్‌లో గల సుమారు వేయేళ్ల క్రితం ఏర్పడిన బొల్లిగుట్ట వచ్చే ఏడాదిలో కనుమరుగు కానుంది. కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే–7 ఓసీ ఎక్స్‌టెన్షన్‌లో భాగంగా ఈ గుట్టను తీసేందుకు సింగరేణి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సుమారు 600 అడుగుల ఎత్తు, 1.3 కి.మీ. పొడవు, సుమారు 100 మీటర్ల వెడల్పు గల ఈ గుట్టను తీయడానికి సుమారు 9 మాసాలు పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గుట్ట కింద జీ–7, జీ–8లతో పాటు ఇతర గ్రేడ్ల బొగ్గు అధికంగా ఉన్నట్లు సింగరేణి అధికారుల ఎక్స్‌ప్లోరేషన్ సర్వేలో వెల్లడైంది. ఈ నాణ్యమైన బొగ్గు తీయాలంటే ఈ గుట్టను తవ్వడం తప్పనిసరి కానుంది. దీనిలో రానున్న కొన్ని వేల ట్రక్కుల రాళ్లు, మట్టిని (ఇతర మైటీరియల్)ను జీకేఓసీలో గతంలో బొగ్గు తవ్విన క్యావెట్రీ (ఖాళీ స్థలంలో) పోయడానికి సిద్ధపడినట్లు తెలిసింది.
త్వరలో రుద్రంపూర్ బొల్లిగుట్ట కనుమరుగు


