రేపు జాబ్‌మేళా
ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 19వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. పేటీఎం సేల్స్ అండ్ సర్వీసెస్‌లో వంద ఉద్యోగాల భర్తీకి టేకులపల్లిలోని మోడల్ కేరీర్ సెంటర్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. అర్హతలు, ఇతర వివరాల కోసం 98667 71213 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభం
ఖమ్మం స్పోర్ట్స్: విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు మంగళవా రం ప్రారంభమయ్యాయి. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం, భక్తరామదాసు కళా క్షేత్రంలో పోటీలు నిర్వహిస్తుండగా రాష్ట్రంలోని 18 జిల్లా ల నుంచి పలువురు మహిళా క్రీడాకారిణిలతో పాటు పురుషులు 300మందికి పైగా హాజరయ్యారు. మహిళలకు టేబుల్‌టెన్నిస్, బ్యాడ్మింటన్, చదరంగం, క్యారమ్స్, టెన్ని కాయిట్‌లో, పురుషులకు లాన్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే, సాంస్కృతిక అంశాల్లో భాగంగా పాటలు, శాసీ్త్రయనృత్యం, వాయిద్యాలు, ఫ్యాన్సీడ్రెస్, నాటిక పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. పోటీలను మంగళవా రం ఉదయం సూపరింటెండెంట్ ఆప్ ఇంజనీర్(ఓఎంసీ ట్రాన్స్‌పోర్ట్) వి.రాంబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్లు బి.బాబునాయక్, ఎన్.జగన్నాథం, ఎం.వీ.కృష్ణారావుతో పాటు పీ.వీ.అప్పారావు, అశోక్, జి.కవిత, జి.మధు, సురేష్, సురేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో
కాయకల్ప బృందం
పెనుబల్లి: పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం కాయకల్ప బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పెనుబల్లి సీహెచ్‌పీలో వైద్య సేవలు, ఆస్పత్రి పరిశుభ్రత, సౌకర్యాలపై ఆరా తీయడంతో పాటు రోజువారీ వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
తొలి ప్రయత్నంలోనే
మెడిసిన్ పీజీ సీటు
బోనకల్: మండలంలోని రావినూతలకు చెందిన గిరిజన విద్యార్థి ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో పీజీలో జనరల్ మెడిసిన్ సీటు సాధించాడు. గ్రామానికి చెందిన బానోతు తులసీదాస్ – సుజాత కుమారుడు వంశీకృష్ణ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తొలిప్రయత్నంలోనే పీజీలో జనరల్ మెడిసిన్ సీటు సాధించడం విశేషం. ఆయనను సర్పంచ్ భూక్యా భద్రునాయక్, ఉప సర్పంచ్ దొండపాటి సత్యనారాయణతో పాటు గుగులోతు పంతు, కొమ్మినేని ఉపేంద్ర, షేక్ వజీర్ తదితరులు అభినందించారు.
హాల్‌టికెట్లు
డౌన్‌లోడ్ చేసుకోవాలి
ఎర్రుపాలెం: వచ్చే విద్యాసంవత్సరం ప్రభుత్వ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలతో పాటు 6నుంచి 9వ తరగతి వరకు బ్యాక్‌సీట్ల భర్తీ కోసం ఈనెల 22న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని గురుకుల పాఠశాలల డీసీఓ, ఎర్రుపాలెం ప్రిన్సిపాల్ చావా జ్యోతి సూచించారు. ఈమేరకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో
జిల్లా విద్యార్థుల ప్రతిభ
ఖమ్మం సహకారనగర్: హైదరాబాద్ దోమలగూడలోని వ్యాయామ విద్య కళాశాలలో జరిగిన దివ్యాంగ విద్యార్థుల రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ కేటగిరీల్లో 20మంది పాల్గొనగా, 14మంది ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నారని సీఎంఓ బాజోజు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈమేరకు విద్యార్థులను విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మతో పాటు కలెక్టర్ అనుదీప్, డీఈఓ చైతన్య జైనీ అభినందించారు.
రేపు జాబ్‌మేళా


