గుండెపోటుతో యువకుడు మృతి
కారేపల్లి: ఒక్కగానొక్క కొడుకు కానరాని లోకా లకు వెళ్లాడని ఆయన తల్లి దండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆ యువకు డు గుండెపోటుతో కుప్పకూలి కుప్పకూలి మృతి చెందిన దృశ్యాన్ని సీసీ కెమెరా ఫుటేజీలో చూసి కన్నీరుమున్నీరయ్యారు. కారేపల్లి స్టేషన్ రోడ్డుకు చెందిన గణితి నారాయణ–ప్రసన్నలక్ష్మి ఏకై క కుమారుడు గణితి సాయిచంద్ర (24) బీ ఫార్మసీ తర్వాత హైదరాబాద్ కూకట్‌పల్లిలోని హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఆయన ఎడమ చేయి లాగడంతో పక్కనే ఉన్న ఓ మెడికల్ షాపునకు వెళ్లి టాబ్లెట్లు అడిగాడు. ఇంతలోనే సాయిచంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో షాపు సిబ్బంది సీపీఆర్ చేసిన ప్రయోజనం దక్కలేదు. ఇదంతా సీసీ కెమెరాలో నమోదు కాగా, ఆయన ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున కారేపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సాయిచంద్ర తండ్రి నారాయణ ఏన్కూర్ మండలం గార్లొడ్డు లక్ష్మీనరసింహాస్వామి దేవాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
టాబ్లెట్ కోసం వెళ్లి కుప్పకూలిన వైనం


