● నెర్రెలు బారుతోంది...
ముదిగొండ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల పొలాలకు నిరంతరం సాగర్ జలాలు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. పంటలు చేతికి వస్తున్న నేపథ్యాన వారబందీ
ఎత్తివేయాలంటూ పలువురు శనివారం తెలిపారు. నిరంతరం నీరు విడుదల చేస్తూ పంటలు
ఎండిపోకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ విషయం తెలిసిన ఇరిగేషన్ డీఈ
పెద్ద రాంబాబు రైతులతో మాట్లాడారు. ఆదివారం నుంచి సాగర్ నీరు సరఫరా చేస్తామని వెల్లడించిన ఆయన సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. – ముదిగొండ


