కరకగూడెం: వేసవి తీవ్రతతో పిల్ల లను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ సెలవుల్లో పిల్లలను ఆపడం వారి వల్ల కావడం లేదు. ఈనేపథ్యాన నీడ పట్టున ఆడుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఈక్రమంలో మధ్యాహ్నం ఇళ్ల ఆవరణ, చెట్ల నీడలో.. ఉదయం, సాయంత్రం ఆరుబయట ఆటలతో పిల్లలు సందడిగా గడుపతున్నారు.
స్నేహితుల సాయంతో..
కొందరు చిన్నారులు సైకిల్ నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. స్నేహితులు వెనక నుంచి సైకిల్ పట్టుకుంటే భయం భయంగానే పెడల్ తొక్కుతూ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకటి, రెండుసార్లు కింద పడినా నిరాశ చెందకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ సైకిల్ నేర్చుకుంటున్నారు.
లక్ష్యసాధన..
పాతకాలపు ఆటలను సైతం పిల్లలు మరువడం లేదు. కొందరు చిన్నారులు నేలపై గీసిన వలయంలో రంగురంగుల గోళీలను పెట్టి లకా్‌ష్య్‌న్ని గురి పెట్టి కొడుతూ ఆటలో మునిగిపోతున్నారు. గెలుపోటములను ఆస్వాదిస్తున్న చిన్నారులు కేరింతల మార్మోగుతున్నాయి. ఈ ఆట ద్వారా పిల్లల్లో ఏకాగ్రత, లక్ష్యసాధన, స్నేహభావం పెరుగుతోందని పెద్దలు చెబుతున్నారు.
స్నేహితుల సాయంతో
సైకిల్ నేర్చుకుంటున్న బాలుడు
గోళీలు
ఆడుతున్న చిన్నారులు


