పింఛన్‌ బెనిఫిట్లు చెల్లించి ప్రాణభిక్ష పెట్టండి | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ బెనిఫిట్లు చెల్లించి ప్రాణభిక్ష పెట్టండి

May 18 2026 7:03 AM | Updated on May 18 2026 7:03 AM

రిటైర్డ్‌ హెచ్‌ఎం వెంకయ్య వినతి

ఖమ్మం మామిళ్లగూడెం: ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ చేసిన తాను కేన్సర్‌ తో పాటు ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతుండగా.. ప్రభుత్వం నుంచి రిటైర్‌మెంట్‌ బెని ఫిట్లు అందక కోసం చికిత్స కోసం తల్లాడుతున్నానని ఖమ్మంకు చెందిన చెరుకుపల్లి వెంకయ్య వాపోయారు. ఈమేరకు బెనిఫిట్లు చెల్లించి తనకు ప్రాణ భిక్ష ప్రసాదించాలని ఆయన కోరారు. ఖమ్మంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకయ్య మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్‌ అయిన తనకు దాదాపు రూ.60 లక్షలు రావాల్సి ఉందని తెలిపారు. తన గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరగక రెండు స్టంట్లు వేశారని, దీనికి తోడు కేన్సర్‌ బారిన పడ్డానని చెప్పారు. ఇప్పటికే ఉన్న డబ్బు చికిత్సకు ఖర్చు చేయగా, ఇంకా రూ.10 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారన్నారు. ప్రాణా పాయ పరిస్థితిలో ఉన్నందున బెనిఫిట్లు విడుదల చేసి తన ప్రాణం కాపాడాలని వెంకయ్య కోరారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు కొత్తపల్లి గురుప్రసాద్‌, మాడుపల్లి బాబు, అల్లంకి జయపాల్‌, తెల్లపూట జమాలయ, మేళ్లచెరువు బాబు, కోటపింజర రాము, చెరుకుపల్లి మురళి, దూరి జయరాజు, తెల్లూరి యాదగిరి, మన్నె గురుమూర్తి, కోట ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement