బోనకల్: వేసవి సెలవులు వృథా కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీయడం, వారిలో సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యంగా సమ్మర్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ తెలిపారు. బోనకల్ మండలం ముష్టికుంట్ల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సమ్మర్ క్యాంప్‌ను సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించగా డీఈఓ పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు కంప్యూటర్, యోగా, ఆటలు, బొమ్మల తయారీ నేర్పించేలా ఇన్‌స్ట్రక్టర్లను నియమించామని తెలిపారు. కాగా, గ్రామ విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పిల ్లలు వచ్చేలా ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అమిరేశి సీతయ్య, సొసైటీ చైర్మన్ బోయినపల్లి వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు ముస్తఫా, చాంద్‌పాషా, ఉపాధ్యాయులు సరస్వతి, ఉషశ్రీ, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు
ఖమ్మంసహకారనగర్: దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్‌ను సురక్షితంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తోందని డీఈఓ చైతన్యజైనీ తెలిపారు. ఖమ్మం నయాబజార్‌లోని జీపీఎస్ భవిత కేంద్రంలో దివ్యాంగులకు సోమవారం ఆమె వీల్‌చైర్లు, సీపీ వాకర్లు, టీఎల్‌ఎం కిట్లుఅందజేశాక మాట్లాడారు. క్యాంప్ ఇన్‌చార్జ్, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ బాజోజు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గుర్తింపు శిబిరంలో చిన్నారులకు 534 పరికరాలను అందజేశామన్నారు. ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మీ, కాంప్లెక్స్ హెచ్‌ఎం ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ చైతన్యజైనీ


